ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా షేక్ లాల్ జాన్ పాషా
జై తెలంగాణ న్యూస్, ఖమ్మం ఏప్రిల్ 19
ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ కు 2024-25 సంవత్సరంనకు ఇటీవల న్యాయవాదులకు ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ప్రధాన కమిటీ ఎన్నిక జరిగింది.అనంతరం ప్రధాన కమిటీకి అనుబంధంగా న్యాయవాదుల ఎగ్జిక్యూటివ్ కమిటీని ప్రకటించారు.ఈ కమిటీ నందు 19 మంది న్యాయవాదులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా ఖమ్మం నగరానికి చేందిన షేక్ లాల్ జాన్ పాషా ఎన్నికైనారు.ఆయనతో పాటు ఎ తిరుపతిరావు ఎస్ వెంకటేశ్వరరావు గుప్తా తన్నీరు పాపయ్య పులి నరసింహరావు పాలడుగు వెంకయ్య చౌదరి ఎల్ కృష్ణ మోహన్ కొప్పుల రవికుమార్ సంపత్ కుమార్ కంచర్ల విజయ్ కుమార్ దారావత్ ప్రసాద్ జడ సురేష్ ఆవుల అనురాధ వెంకటరమణాచారి వేల్పుల సురేష్ దుర్గా రాణి రామానుజం మహేష్ స్పందనా రెడ్డి ముమ్మాడి సతీష్ లకు స్థానం కల్పించారు.ఈ సంధర్బంగా ఈసి మెంబర్ లాల్ జాన్ పాషా మాట్లాడుతూ జిల్లా బార్ అసోసియేషన్ తో కలిసి న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తామని జిల్లా కోర్ట్ నందు దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్నా సమస్యలను పరిష్కరించటానికి జూనియర్ న్యాయవాదుల సమస్యల పరిస్కారానకు కృషి చేస్తామని తెలిపారు.తనకు కమిటీ నందు అవకాశం కల్పించిన జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు నేరెళ్ళ శ్రీనివాస్ కి జిల్లా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చింతనిప్పు వెంకటేశ్వర రావుకి బార్ అసోసియేషన్ కమిటీకి సీనియర్ న్యాయవాది మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొండపల్లి జగన్ మోహన్ రావు కి సీనియర్ న్యాయవాది షేక్ లతీఫ్ కి సీనియర్ న్యాయవాదులకు ధన్యవాదములు తెలిపారు.