భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన
జై తెలంగాణ న్యూస్ సత్తుపల్లి
సత్తుపల్లిలోని కృషి బైపాస్ రోడ్ లో భర్త ఇంటి ముందు భార్య ధర్నాకు దిగింది. వందనం గ్రామానికి చెందిన సంపూర్ణకు సత్తుపల్లికి చెందిన పోతురాజు సతీష్ కు 2018లో వివాహమైంది. కొద్దిరోజులు బాగానే ఉన్నప్పటికీ ఆ తరువాత తల్లి మాటలు విని తన భర్త అకారణంగా తనను వేధించటం మొదలు పెట్టాడని ఆమె తెలిపింది. తనకు న్యాయం చేయాలని తన బిడ్డ ఆలనా, పాలన చూసుకోవాలని వేడుకుంటోంది.