బిజెపిలో చేరిన పలువురు నియోజకవర్గ నేతలు

బిజెపిలో చేరిన పలువురు నియోజకవర్గ నేతలు

 

జై తెలంగాణ న్యూస్, మంచిర్యాల జిల్లా బ్యూరో

 

మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తుల సమ్మయ్య, చెన్నూరు మున్సిపల్ కౌన్సిలర్ జాడి సురేఖ తిరుపతి, చెన్నూరు పట్టణ నాయకులు గర్రెపల్లి శాంతా వెంకట నరసయ్య, కమ్మల శ్రీనివాస్ లు శుక్రవారం బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ నాయకత్వంలో బిజెపి పార్టీలో చేరారు. హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, చెన్నూరు అసెంబ్లీ కన్వీనర్ అక్కల రమేష్, అదిలాబాద్ పార్లమెంట్ కో కన్వీనర్ కొలిపాక కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :