హెచ్చుతగ్గులు లేని నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు
విద్యుత్ శాఖ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్ణాటి వరుణ్ రెడ్డి
జై తెలంగాణ న్యూస్, మంచిర్యాల జిల్లా బ్యూరో
జిల్లాలో హెచ్చుతగ్గులు, అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని విద్యుత్ శాఖ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్ణాటి వరుణడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఓ అండ్ ఎం సిబ్బంది అవగాహన, శిక్షణ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ శేషారావుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ, వేసవికాలం అయిందున ట్రాన్స్ఫార్మర్ల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించాలని, వడగాల్పుల కారణంగా విద్యుత్ తీగలు దెబ్బతినకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. పరిశ్రమలు, నివాస గృహాలు ఇతరత్రా అన్ని కేటగిరీలకు నాణ్యమైన విద్యుత్ నిరంతరాయంగా అందించాలని, మరమ్మత్తులు జరిగే ప్రాంతాలలో ముందుస్తుగా విద్యుత్ నిలిపివేసే సమయాన్ని తెలియజేయాలని, చేపట్టిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.