కుటుంబాలను చీల్చే రాజకీయాలా..? దోషేవరు..?

కుటుంబాలను చీల్చే రాజకీయాలా..? దోషేవరు..?

జై తెలంగాణ న్యూస్ ( ఆంధ్ర ప్రదేశ్ కంటైట్ రైటర్ – పాషా )

వైస్ జగన్ మోహన్ రెడ్డి తన రాజకీయ అవసరాలకు తల్లిని, చెల్లిని రాజకీయ వేదికల మీదకు తీసుకువచ్చి వారి నుంచి ఎంత స్థాయిలో ఆదరణ సంపాదించాలో అంతా సంపాదించి అధికారం అనే అస్త్రం అందగానే వారిని పక్క రాష్ట్రానికి సాగనంపారు అనే అపవాదును కూటగట్టుకున్నారు. అలాగే వైసీపీ పార్టీ పెట్టిన కొత్తలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వివేకాను వైసీపీ లోకి రప్పించడానికి, వివేకాను వైసీపీ తరుపున పని చేయించడానికి కూడా తల్లిని, చెల్లిని అడ్డుపెట్టారు అనే వాదన కూడా అప్పట్లో బాగా ప్రచారంలో ఉంది. అయితే తన రాజకీయ అవసరాల కోసం కుటుంబ బంధాలను అడ్డుగా పెట్టుకోవడానికి గాని అవే బంధాలు తన అధికారానికి అడ్డుగా నిలబడితే తొలగించాడనికి, వదిలించు కోవడానికి కానీ వెనుకాడని నైజం జగన్ సొంత అంటూ షర్మిల, వివేకా ఉదంతాలను ఉదాహరణలుగా చెపుతున్నారు ప్రతిపక్ష పార్టీలు. అయితే తాజాగా వివేకా హత్య పైన సునీత, షర్మిల పైన వైసీపీ చేస్తున్న వ్యక్తిగత దాడి పై స్పందిస్తూ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ జగన్ కు ఒక బహిరంగ లేఖ రాసారు. తండ్రి చనిపోతే వచ్చే బాధేంటో తెలిసిన నువ్వు సునీత పట్ల ఇలా వ్యవహరించడం తగునా..? అన్నగా అండగా ఉండాల్సిన నువ్వు, నీ పార్టీ నేతలు చేస్తున్న దిగజారుడు విమర్శలు చూస్తూ, వింటూ ఎలా మౌనంగా ఉండగలుగుతున్నావ్..?

వివేకాను చంపిన వారికీ అండగా ఉంటూ సొంత వారి పై ఈ మానసిక దాడెంటి..? అంటూ జగన్ ను ఉద్దేశించి సౌభాగ్యమ్మ లేఖ రాసారు. అయితే ‘దెబ్బ ఒకరికి తగిలితే మందు మరొకరికి వేసినట్లు’ ‘లేఖ ఒకరికి రాస్తే సమాధానం మరొకరి నుంచి వచ్చింది’. ఇప్పుడీ రాజకీయ క్రీడలోకి వైస్ కుటుంబం నుంచి మరో మహిళ బయటకొచ్చారు. వైస్ భాస్కర్ రెడ్డి అర్ధాంగి, వైస్ అవినాష్ రెడ్డి తల్లి వైస్ లక్ష్మీ తెర మీదకు వచ్చారు. సౌభాగ్యమ్మకు కౌంటర్ గా జగనే ఈమెను కూడా రాజకీయాలలోకి దింపారు అనే ప్రచారం ఊపందుకొంది. ఒక పక్క తండ్రి చనిపోయిన బాధలో ఉండగానే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వైస్సార్ కుటుంబాన్ని ఒంటరిని చేసి వేధిస్తుంటే కూడా జగన్ ను ఒంటరిని చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికే అండగా ఉన్నప్పుడు జగన్ పడిన ఆవేదన మీకు తెలుసా..? విజయమ్మ పై వివేకాను పోటీ పెట్టినప్పుడు జగన్ మనోవేదన మీకు తెలుసా..? వివేకా హత్య కేసు ఆరోపణలు మోస్తూ వైస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి పడుతున్న మనోవేదన మీకు తెలుసా..? అంటూ వైస్ సౌభాగ్యమ్మ కు కౌంటర్ లేఖ రాసారు వైస్ లక్ష్మీ. ఇలా ఒక్క హత్య కేసు గురించి వైస్ కుటుంబంలో ఉన్న మహిళలంతా రాజకీయ వేదికల మీదకు చేరారు. సునీత, షర్మిల, సౌభాగ్యమ్మ ఒక వైపు నిలబడితే…లక్ష్మీ, విమల మరో వైపు నిలిచారు. ఇక విజయమ్మ ఏ వైపు నిలవాలో తేల్చుకోలేకున్నారు. ఇలా తన స్వార్ధ రాజకీయ ప్రయోజనం కోసం వైస్ కుటుంబాన్ని రెండుగా చీల్చింది ఎవరు..? దీనికి కర్త, కర్మ, క్రియ…ఎవరు..? రాజకీయాలతో సంబంధం లేని మహిళను కూడా రాజకీయ విమర్శలలోకి లాగి ‘YS’ అనే బ్రాండ్ పరువుని బజారుకు ఈడుస్తోందెవరు..? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. గతంలో లక్ష్మీ పార్వతిని పావులా వాడుకుని నందమూరి కుటుంబ పరువుని బజారుకు లాగాలని ప్రయత్నించింది వైసీపీ కాదా..? అలాగే ఎన్టీఆర్ కుమార్తె, చంద్రబాబు అర్దాంగి అయిన భువనేశ్వరి పై నిండు అసెంబ్లీ సాక్షిగా నిందలు వేసి నారా కుటుంబ పరువు తీసింది వైసీపీ కాదా..? వ్యక్తిగత జీవితంలో వచ్చిన ఒడిదుడుకులను సాకుగా చూపించి కొణిదల కుటుంబంలోని ఆడవారిని పై నిత్యం చేస్తున్న దాడులకు కారణం వైసీపీ కాదా..? ఇలా తన రాజకీయ స్వార్థం కోసం ఎన్నో కుటుంబాల మహిళల పరువు ప్రతిష్టలతో జగన్ ఆడుతున్న రాజకీయ చదరంగానికి దేవుడు ఇస్తున్న ముగింపు ఇదే అంటూ టీడీపీ, జనసేన శ్రేణులు వైస్ కుటుంబంలో జరుగుతున్న రచ్చ పై తమ స్పందన తెలియచేస్తున్నారు. ప్రస్తుత వైసీపీ పరిస్థితి చూస్తుంటే మహిళ మీద మొదలుపెట్టిన రాజకీయాలు మహిళతోనే ముగిసేలా ఉన్నాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :