జగన్‌ మ్యానిఫెస్టోలో ఏపీకి రాజధాని లేనట్లే

జగన్‌ మ్యానిఫెస్టోలో ఏపీకి రాజధాని లేనట్లే

జై తెలంగాణ న్యూస్ ( ఆంధ్ర ప్రదేశ్ డెస్క్ ) కంటైట్ రైటర్ – పాషా

వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డి శనివారం తాడేపల్లి ప్యాలస్‌లో వైసీపి ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేశారు. దానిలో రాజధాని గురించి చాలా క్లుప్తంగా మూడు ముక్కలతో సరిపెట్టేశారు. మళ్ళీ అధికరంలోకి రాగానే విశాఖ రాజధానిగా చేసుకొని పాలన ప్రారంభిస్తామని, కర్నూలులో న్యాయరాజధాని, అమరావతిలో శాసన రాజధాని ఉంటాయని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ముందుకే సాగుతున్నామని పేర్కొన్నారు. ఏపీ జలవనరుల మంత్రి అంబటి రాంబాబు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని ఎప్పుడో తేల్చి చెప్పేశారు. బహుశః అందుకే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంపై వైసీపి మ్యానిఫెస్టోలో ఎటువంటి హామీ ఇవ్వలేదని భావించవచ్చు. కనుక జగన్‌ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చినా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయగలదో లేదో తెలీదన్న మాట! అమరావతి నిర్మించాలంటే లక్ష కోట్లుకావాలని అదే విశాఖ రాజధాని అయితే ఓ 5-6000 కోట్లు ఖర్చుపెట్టి సులువుగా ఏర్పాటు చేసుకోవచ్చని జగన్‌ స్వయంగా చెప్పారు. జగన్‌ అమరావతిని వద్దనుకున్నారు కనుక దానిని పాడు పెట్టేశారని సర్ధి చెప్పుకోవచ్చు. కానీ భారీ మెజార్టీతో అధికారం చేపట్టి ఐదేళ్ళపాటు రాష్ట్రాన్ని పాలించినా తాను స్వయంగా కనిపెట్టిన మూడు రాజధానులు, కనీసం విశాఖ రాజధాని ఏర్పాటు చేయలేకపోయారు. ఐదేళ్ళలో ఒక్క రాజధాని కూడా ఏర్పాటు చేయలేక ప్రతిపక్షాలను నిందిస్తూ, కోర్టు కేసులతో కాలక్షేపం చేసేసిన వైసీపి ప్రభుత్వం, రాజధాని పేరుతో ప్రజలను ఓట్లు అడిగే అర్హతే కోల్పోయిందని చెప్పక తప్పదు. కానీ మళ్ళీ గెలిపిస్తే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని వైసీపీలో మ్యానిఫెస్టోలో నమ్మబలుకుతున్నారు. జగన్‌ ముచ్చటపడి రూ.400 కోట్లతో ఋషికొండపై నిర్మించుకున్న విలాసవంతమైన భవనంలో కోర్టులకు భయపడి అడుగుపెట్టలేకపోయారు. మరి అటువంటప్పుడు మళ్ళీ గెలిపిస్తే విశాఖ రాజధాని ఎలా ఏర్పాటు చేస్తారు? మ్యానిఫెస్టోలో చెప్పి ఉంటే బాగుండేది. సంక్షేమ పధకాల గురించి మ్యానిఫెస్టోలో డప్పు కొట్టుకొన్న జగన్‌, విశాఖ రాజధాని గురించి మాత్రం పెద్దగా ఏమీ చెప్పకపోవడం గమనిస్తే, వైసీపిని మళ్ళీ గెలిపించినా విశాఖ రాజధానిని ఏర్పటు చేయలేదని అర్దమవుతుంది. కనుక అమరావతి రాజధాని కావాలనుకునే వారు టిడిపి, జనసేన, బీజేపి కూటమికి, రాష్ట్రానికి రాజధాని అవసరం లేదనుకున్నవారు వైసీపికి ఓట్లు వేసుకుంటే మంచిదేమో?

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :