వైసీపీ మానిఫెస్టో లో ఓన్లీ ‘మనీ’ యే ఉందా..?

వైసీపీ మానిఫెస్టో లో ఓన్లీ ‘మనీ’ యే ఉందా..?

జై తెలంగాణ న్యూస్ ( ఆంధ్ర ప్రదేశ్ డెస్క్ )

కంటైట్ రైటర్ – పాషా

ఈ రోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ అధినేత జగన్ తమ ఎన్నికల మానిఫెస్టో విడుదల చేసారు. 2019 ఎన్నికల ముందు విడుదల చేసిన మానిఫెస్టో ను వైసీపీ ఎంత గౌరవించిందో ఈ ఐదేళ్ల పాలనలో ప్రజలకు కళ్లకుకట్టినట్టు చూపించారు వైసీపీ నేతలు. ప్రత్యేక హోదా మొదలుకొని మధ్యపాన నిషేధం, సీపీఎస్ రద్దు, పోలవరం పూర్తి, కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి, రాజధాని నిర్మాణం, ప్రతి ఏటా జాబ్ క్యాలెండరు, పిన్షన్ 3000 లకు పెంచుతాం అని ఎన్నికల చివరి మూడు నెలల ముందు 3000 చేసి, ఇచ్చిన హామీలకు చేసే పనులకు సంబంధం లేదని నిరూపించుకున్నారు జగన్. ఈ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి అనే పదాన్ని వైసీపీ డిక్షనరీ నుండి తొలగించి కేవలం బటన్ నొక్కడం మీదే ద్రుష్టి పెట్టిన జగన్ ఇప్పుడు కూడా ‘పంచడం మీదే కానీ పనుల’ మీద ద్రుష్టి పెట్టలేదని తేలిపోయింది. మళ్ళీ అధికారంలోకి వస్తే ఇప్పుడు రాష్ట్రంలో అమలవుతున్న పథకాల నోటు బరువు కాస్త పెంచి అమలు చేస్తామని, ‘డబ్బు పట్టు ఓటు కొట్టు’ అనేలా వైసీపీ తన మేనిఫెస్టో ను రూపొందించింది. అంటే జగన్ అధికారం కోరుకుంటుంది కేవలం బటన్లు నొక్కడానికేనా..? ఇది పేరుకే మానిఫెస్టో, ఈ మానిఫెస్టోలో కేవలం ‘మనీ’ మాత్రమే ఉందని డబ్బుతో ప్రజల ఓట్లు కొనాలని జగన్ భావిస్తున్నారంటూ సామజిక వేత్తలు వైసీపీ మ్యానిఫెస్టోను తప్పుబడుతున్నారు. ఓ వర్గం ప్రజల ఓట్లను కొనడానికి రాష్ట్ర ప్రజలందిరి పై భారం వేస్తూ తానూ రాజకీయ లబ్ది పొందాలనుకోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణిస్తున్నారు మధ్యతరగతి ప్రజలు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు తీసుకువచ్చి, ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించి, కాగితాలలో కాకుండా కంటికి కనపడే అభివృద్ధి చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలే కానీ ఇలా అప్పులు చేసి సంక్షేమం చేస్తామంటే ఆ అప్పుల బాధ్యత ఎవరిదీ..? దాని భారం ఎన్ని తరాలు మోయాలి..? డబ్బులు పంచడానికే ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్న వైసీపీ కేవలం ప్రజలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూడాలనుకుంటుందా..? రాజకీయాలు చేయడానికి డబ్బు అవసరమే కానీ ఆ డబ్బుతో రాజకీయాలను శాసించాలనుకోవడం, పదవులను పొందాలనుకోవడం , ప్రజలను కొనాలనుకోవడం మాత్రం హీనమైన చర్యగానే భావించాలి. ఇప్పటికే అభివృద్ధిలో ఒరిస్సాతో పోటీపడుతున్న ఏపీ ఇక మళ్ళీ సంక్షేమమే, అభివృద్ధి లేదంటే ఖచ్చితంగా ఏపీ మరో శ్రీలంక కావడం కాయం. తాజాగా టీడీపీ నేత నారా లోకేష్ కూడా వైసీపీ మేనిఫెస్టో మీద స్పందిస్తూ ఇది వైసీపీ మేనిఫెస్టో కాదు జగన్ రాజీనామా లేఖ అంటూ కౌంటర్ వేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :