సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే ఉరుములు..మెరుపులు సాధారణం. ఈ ఏడాది
ఋతుపవనాలు వేగంగా రాష్ట్రంలో విస్తరిస్తున్నాయి. గత ఏడాదితో పోలీస్తేవర్షాలు సకాలంలో పడుతున్నాయనే చెప్పవచ్చు. అయితే ఋతుపవనాలతోపాటు
ఉరుములు..మెరుపులు..భారీ పిడుగులు పడుతుండటం కాస్త ఆశ్చర్యానికి గురి
చేస్తోంది. వర్షం వచ్చినప్పడులా కనీసం జిల్లాకు రెండు మూడు చోట్ల
పిడుగు పాటుకు మరణవార్త వినాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఒక చోట
రైతులు మరణిస్తుంటే, మరోపక్క పిడుగుల దాటికి పశువులుచనిపోతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పిడుగుల ప్రభావం ఎక్కువగాఉంది. సాధారణంగా తుఫానుల రాక అంతా బంగాళాఖాత మీదుగా జరుగుతుంది. ఇక్కడపరిసర జిల్లాలన్ని వ్యవసాయ ఆధారిత ప్రాంతాలుగా ఉండిపోవడంతోపిడుగుపాటు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నది విశ్లేషకుల మాట.ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం ఎక్కువగా ఉండటం రాష్ట్రంలో ప్రధాన
ప్రాంతాలన్ని సముద్రాన్ని ఆనుకుని ఉండటం ఎంతమేలైందో, తుఫానుల
వచ్చినప్పుడు నష్టం కూడా అదే తీరిన కనిపిస్తుంది. లైలా, ఖేల్, ఫణి,
హుద్‌హుద్ వంటి తుఫాన్లు తీవ్రనష్టాన్ని మిగిల్చాయి. ప్రస్తుతం మన
రాష్ట్రానికి తుఫానుల తాకిడి గత రెండేళ్లలో లేనప్పటికీ పిడుగులు,
ఉరుములు మాత్రం వదలడం లేదు. ఇది శాపమో లేక ప్రక`తి ప్రకోపమో
తెలియదు కాని, వానలు వచ్చినప్పడు మాత్రం విపత్తుల శాఖ జాగ్రత్తలు
పాటించడమే మేలనిపిస్తోంది.
