తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం అనగానే ఆధ్యాత్మికతకు పెట్టింది పేరు.
అలాంటి ప్రాంతంలో ఉన్న సీతయ్యగారితోటలో ఏకరాతిశిలా విగ్రహంగా కొలువైన
వినాయకుడుని, తోటలో వినాయకుడుగా కొలుస్తారు భక్తులు. ఇటీవల ఆలయం
పునఃనిర్మాణం జరిగింది. కాని ప్రారంభం జరగలేదు. కరోనా ప్రభావంతో
ముహుర్తాలు వాయిదా పడటంతో కాలం సాగిపోయింది. చివరకు గత ఏడాది
కాలంపైగా ఉన్న చిన్న గుడిలో బొజ్జ గణపయ్యను ఎట్టకేలకు మూషిక పీఠం
ఎక్కించి అనంతరం ప్రతిష్టించారు. పిఠాపురం పట్టణంతో పాటు పరిసర
ప్రాంతాల భక్తులు వినాయకుడి ప్రతిష్టామహోత్సవానికి హాజరయ్యారు. ఈ
కార్యక్రమానికి సీతయ్యగారితోట యువత, మహిళలతోపాటు, పలువురు
ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు విఘ్నేశ్వరుడిని దర్శించుకుని
ఆశీసులు పొందారు.
