పేద‌ల కోసమే జ‌గ‌న్ ప‌రిత‌పిస్తున్నారు

పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొర‌బాబు

పిఠాపురం,(ADITYA9NEWS) : పేద ప్ర‌జ‌ల కోస‌మే నిత్యం జ‌గ‌న్ ప‌రిత‌పిస్తున్నార‌ని తూర్పుగోదావ‌రి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొర‌బాబు అన్నారు. పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. గోకివాడ గ్రామంలో రూ.4 ల‌క్ష‌ల నిధుల‌తో నూత‌నంగా నిర్మించిన క‌ల్వ‌ర్టును ప్రారంభించిన ఎమ్మెల్యే దొర‌బాబు మీడియాతో మాట్లాడారు. గ్రామాల‌లో జ‌గ‌న్‌కు మంచి మ‌ద్ధతు ఉంద‌ని, ఆయ‌న అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు గ‌తంలో ఎవ్వ‌రూ చేయ‌లేద‌న్నారు. రాబోవు కాలంలోనూ జ‌గ‌న్‌కు తిరుగులేద‌న్న ఆయ‌న‌, గ్రామాల‌లో క‌లిసిక‌ట్టుగా ఉండి అభివృద్ధి ప‌నుల‌కు స‌హ‌క‌రించుకోవాల‌ని సూచించారు. కార్య‌క్ర‌మంలో గ్రామ సర్పంచ్ కీర్తి హరినాథ్‌ బాబు, ఉప సర్పంచ్ నామా సురేష్ కొత్తెం బుజ్జి, జెడ్డా సూర్య‌ప్ర‌కాష్‌, ప‌లు గ్రామాల స‌ర్పంచ్‌ లు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :