ZRUCC సభ్యుడు రావుల మాధవరావు
పిఠాపురం,(ADITYA9NEWS): తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఉన్న రైల్వే గేట్ల వద్ద అండర్ పాస్ వంతెనల నిర్మాణంతోపాటు, రైల్వే బ్రిడ్జిల నిర్మాణానికి ఎంపీ గీతా విశ్వనాథ్ చేస్తున్న కృషి మరువలేనిదని ZRUCC సభ్యుడు రావుల మాధవరావు అన్నారు. తనకు రైల్వే లో ZRUCC సభ్యుడిగా అవకాశం కల్పించిన ఆమె పిఠాపురం నియోజకవర్గంలో రైల్వే అండర్ పాస్‌లకు నిధులు తీసుకురావడం చాలా ఆనందకరమన్నారు.
మాధవపురం రైల్వేగేటు వద్ద అండర్ పాస్ వంతెనకు రూ.5.23 కోట్లు నిధులు మంజూరు కావడం ఆమె పని తనానికి నిదర్శనమన్నారు. ఈ అభివృద్ధి పనుల్లో పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు సహకారానికి మాధవరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో పిఠాపురం-ఉప్పాడ రైల్వే గేటు వద్ద వంతెన నిర్మాణం చేపట్టేందుకు ఎంపీ, ఎమ్మెల్యేలు కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.