*ఇరువర్గాలు పరస్పర దాడులు..ముగ్గురికి గాయాలు
ఉప్పాడ, (ADITYA9NEWS) : తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడలో రెండు వర్గాల మధ్య వివాదంకాస్త ఘర్షణకు దారి తీసింది. ఉప్పాడ పరిధిలో ఉన్న అమినాబాద్ రేవు సమీపంలో ఫిషింగ్ హార్బర్ పనులు జరుగుతున్నాయి. తమకు చెప్పకుండా పనులు చేయడమేంటని ఒక వర్గం వారు ప్రశ్నిస్తే , మీకు చెప్పేదెంటని మరోక వర్గం ఎదురు తిరగడంతో తలెత్తిన మాటల వివాదం కత్తులతో దాడులు చేసే వరకూ వెళ్లింది. దీంతో ఒక వర్గంపై మరో వర్గం పరస్పర దాడులు చేసుకున్నారు. ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పిఠాపురం సిఐ వై.ఆర్.కె . శ్రీనివాస్, ఎస్సై అబ్దుల్ నబీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసు సిబ్బంది ఎక్కువగా మోహరించడతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇదిలా ఉండగా ఘర్షణ పడ్డ ఇరువర్గాలు అధికార పార్టీకి చెందిన వారు కావడం గమనార్హం.