పెన్ష‌న్లు పెంచుతామ‌ని.. ప‌న్నులు పెంచారు

* జ‌గ‌న్ పాల‌న‌పై నారా లోకేష్ విమ‌ర్శ‌లు

* సామ‌ర్ల‌కోట‌లో పొట్టి శ్రీరాములు, నంద‌మూరి విగ్ర‌హాల ఆవిష్క‌ర‌ణ‌

సామ‌ర్ల‌కోట‌, (ADITYA9NEWS): అధికారంలోకి వ‌స్తే వృద్ధుల‌క‌, విక‌లాంగుల‌కు, వితంతువుల‌కు పెన్ష‌న్లు పెంచుతామ‌ని చెప్పిన జ‌గ‌న్ పన్నులు పెంచార‌ని, నిత్య‌వ‌స‌రాల ధ‌ర‌లు పెంచార‌ని టీడీపీ జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు.

తూర్పుగోదావ‌రి జిల్లా సామ‌ర్ల‌కోట‌లో అమ‌ర‌జీవి పొట్టి శ్రీరాములు, నంద‌మూరి తార‌క రామారావు విగ్ర‌హాల ఆవిష్క‌ర‌ణ‌లో పాల్గొన్న లోకేష్‌కు టీడీపీ కార్య‌క‌ర్త‌లు, అభిమానులు అఖండ స్వాగ‌తం ప‌లికారు. సామ‌ర్ల‌కోట నుండి బైక్ ర్యాలీగా పెద్దాపురం వెళ్లిన లోకేష్ అక్క‌డ ప్ర‌జ‌ల‌నుద్దేశించి మాట్లాడారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప ఆధ్వ‌ర్యంలో కార్య‌క్ర‌మాల‌ను టీడీపీ కార్య‌క‌ర్త‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :