తూర్పుగోదావరి చింతలూరులో 12 అడుగుల పాము ప్రత్యక్షం
ప్రత్తిపాడు, (ADITYA9NEWS): తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం చింతలూరు సరుగుడు తోటలో కింగ్ కోబ్రా సంచరించడంతో స్థానికలు హడలిపోతున్నారు. సరుగుడు తోటల్లోకి వెళ్లిన రైతులు బుధవారం కింగ్ కో బ్రా పామును చూసి పరుగులు తీశారు. సుమారు 12 అడుగుల పొడవున్న ఈ కోబ్రా మనుషులను చూస్తూ ఆగి వెళుతుందని గ్రామానికి చెందిన రైతులు బొడ్డు లోవరాజు, సూరిబాబులు చెబుతున్నారు.
ప్రస్తుతం వీరద్దిరి పొలాల్లో ఇది ఉన్నట్టు స్థానిక రైతులు చెబుతుండగా, త్వరిత గతిన అటవీశాఖ అధికారులు స్పందించి కోబ్రాను పట్టుకుని అడవుల్లో వదలాలని చింతలూరు గ్రామస్తులు కోరుతున్నారు. ఈ కోబ్రా సంచారంతో పిల్లలను బయటకు వెళ్లనీయకుండా కాపలా కాస్తున్నారు.