త‌ర‌గ‌తుల్లేవ్ ప‌రీక్ష‌లు ఏలా.?

TS EAMCET పై తల్లిదండ్రులు ఆందోళ‌న‌

హైద‌రాబాద్‌, : విద్యార్థులందరూ కోవిడ్ నిబంధ‌న‌లు పాటించాల్సి ఉన్నందున , విద్యార్థుల‌, త‌ల్లిదండ్రులు ఈసారి ఎలాంటి ముంద‌స్తు ఏర్పాట్లు చేసుకోక‌పోవ‌డంతో పరీక్ష సమయానికి దాదాపు రెండు గంటల ముందుగానే ప‌రీక్షా కేంద్రానికి చేరుకున్నారు. దీని ఫలితంగా విద్యార్థులందరూ పరీక్ష హాల్‌లో టెన్షన్-ఫ్రీ ఎంట్రీని పొందారు. మహమ్మారి పరిస్థితుల దృష్ట్యా అన్ని ఏర్పాట్ల‌ను బాగానే చేశార‌ని విద్యార్థులు తెలిపారు.

అయితే గత సంవత్సరం నుండి విద్యార్థులు కరోనా పరిస్థితుల కారణంగా పాఠశాలలు మూసినందున విద్యార్థులు ప్రత్యక్ష బోధనకు దూరమయ్యారని, దాని ప్ర‌భావం వ‌ల్ల పోటీ పరీక్షలకు సిద్ధమవ్వడంలో సందిగ్ధ‌త ఏర్ప‌డింద‌న్నారు. దీనిపై తల్లిదండ్రులు విద్యార్థుల ప‌రిస్థితిపై ఆందోళ‌న చెందుతున్న‌ట్లు తెలిపారు. ఆన్‌లైన్ బోధన ప్రయోజనాల కోసం సిలబస్ తగ్గించబడింది. ఇలాంటి స‌మ‌యంలో సిల‌బ‌స్ కాకుండా బ‌య‌ట ప్ర‌శ్న‌లు అడిగితే ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని చెప్ప‌కొచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :