కడప, కర్నూలు , నెల్లూరు, విజయనగరం జిల్లాలే కీలకం
అమరావతి, ( ADITYA9NEWS): ఒక్క సీటు గెలవని జిల్లాలపై టిడిపి దృష్టి సారించింది. అలాంటి కోవలో ఉన్నవే కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాలు. ఇక్కడ 2019 ఎన్నికల తర్వాత పూర్తిగా టీడీపీ తన బలాన్నికోల్పోయిందనే చెప్పాలి. ఈ నాలుగు జిల్లాల్లో టీడీపీ నాయకులను, కార్యకర్తలను యాక్టివ్ చేయడానికి ఉన్న అవకాశాలన్నింటిని పార్టీ పరిగణలోకి తీసుకుంటున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది ఒకరకంగా టీడీపీ పునరుజ్జీవనానికి నాందిగా చెప్పాలి.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి కర్నూలు, కడప, నెల్లూరు మరియు విజయనగరం జిల్లాలలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఈ నాలుగు జిల్లాల్లో ఒకటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినది కాగా, మిగిలిన మూడు జిల్లాలు దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన నేతలున్నారు. కడపలో అయితే ప్రతీ సీటు దగ్గర దాదాపుగా 20 వేలకుపైగా ఓట్లతో ఓడిపోయింది టీడీపీ. కర్నూలో టీడీపీ కేవలం ఒక సీటులో మాత్రమే మంచి పోరాటం చేయగలిగింది. నెల్లూరులో కూడా నెల్లూరు సిటీ సీటుకు మాత్రమే టీడీపీ గట్టి పోటీనిచ్చింది. టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి నారాయణ 1988 ఓట్లతో మాత్రమే ఓడిపోయారు.
అయితే ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉంది. వైసీపీ అధికారం చేపట్టి రెండున్న సంవత్సరాలు అవుతుండగా గత ప్రభావం ఇప్పుడు ఈజిల్లాలపై తగ్గిందనేది టీడీపీ వాదన. కొన్ని చోట్ల నాయకత్వ లోపాల వల్ల తప్పితే టీడీపీకీ అనుకూలంగా ప్రజలు మారుతున్నారని ఆ పార్టీ పెద్దల మాట. ముఖ్యంగా నెల్లూరులో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి నారాయణ క్రీయా రహితంగా మారడంతో నెల్లూరు జిల్లా సమస్యాత్మకంగా ఉందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ప్రస్తుత వైసీపీ పాలనపై వస్తున్న వ్యతిరేఖతను సద్వినియోగం చేసుకుని ముందుకెళ్లాలని చూస్తుండం కొంత ఆశజనకంగా ఉందని టీడీపీ అధిష్టానం భావిస్తోంది.