థీయేటర్లలో సంబరాలేనంటున్న అభిమానులు.
సినిమా డెస్క్,(ADITYA9NEWS): కరోనా మొదటి వేవ్ లో జరిగిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సినీ నిర్మాతలు తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాల విషయంలో ఆచీ తూచి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం వారిని థర్డ్ వేవ్ భయం వెంటాడుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రాబోయే మూవీ ‘ఘని’ విడుదల ప్రకటన విడుదల కావడం అభిమానులకు ఆనందమే. వచ్చే దీపావళికి ఈసినిమా ఉంటుందని నిర్మాతలు తాజాగా ప్రకటించారు.
థియేటర్లలో దీపావళి చేసుకుందాం.. అని వరుణ్ తేజ్ సరికొత్త పోస్టర్‌తో ట్వీట్ చేశారు. వరుణ్ బాక్సింగ్ గ్లోవ్స్ మరియు చేతులు పైకెత్తుతూ కనిపించడంతో అభిమానుల్లో ఘనిపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.
కిరణ్ కొర్రపాటి ఈ స్పోర్ట్స్ డ్రామాకి దర్శకత్వం వహిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ టాలీవుడ్‌కి పరిచయం అవుతోంది. ఈ చిత్రంలో జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి మరియు నవీన్ చంద్ర కీలక సహాయ పాత్రలు పోషిస్తున్నారు. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ ‘ఘని’ చిత్రంతో చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు.