సాధారణంగా సినిమా వాళ్లంటే అందరికి మనస్సులో ఏవే వో ఉహాగానాలు. ఒకప్పుడు సినిమావాళ్లు వేరు, ఇప్పుడు జరగుతున్న సినిమా వేరు.పాత యాక్టర్లు
తప్పితే, ఎంత పెద్ద హీరో, హిరోయిన్ అయినా ఒకానోక సమయంలో వెనక్కి
తిరగాల్సిందే. పాతరోజుల్లో సినిమాకు ఉన్న ఆధరణ ఇప్పుడు లేకపోవడం
ఇప్పుడు సినిమా యాక్టర్లు నమ్మపోయినా నిజమే. కొంత మంది హీరో
హీరోయిన్‌లైతే రోజువారి కూలీగా మారిపోయిన పరిస్థితి నెలకొంది.కనీసం ఎంత
తక్కువగా చూసినా ఏడాది ఒకరిద్దరు నటు అనూహ్యంగా మృతి చెందడం సినీ
పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.

సాధారణంగా కోట్ల రూపాయాను నమ్మకంగా పెడుతున్న నిర్మాతలు నష్టపోయినా ,
డైరక్టర్ పూర్తిగా సినిమాకు న్యాయం చేయపోయినా పరోక్షంగా ఆప్రభావం నటీ
నటులపై పడుతుంది. ఆ తరువాత సినిమాకు సరైన ఆఫర్లు లేకపోవడం నుండి వారికి
జీవితంలో ఆపజయం అనేది ఎదురవుతుంది. మరోపక్క సినిమా పరిశ్రమలో
ఎక్కడా లేని రాజకీయాల పుణ్యమా అని ఉత్తమ నటీనటులను పరిశ్రమకు దూరం
చేయడంలో అంతర్గత రాజకీయాలు కూడా కొత్త నటీ నటులకు శాపమే. సినీ
పరిశ్రమలో ఉదయకిరణ్ దీపం ఏలా వెలిగి ఆరిపోయిందో తెలిసింది. కపట
నాటకాల్లో ఆరిపోయిన దీపాలెన్నో ..ఇలా వారి చావుకు కారణం ఏదైనా.
ఉహించకుండా ఎదిగిన వారిని మాత్రం సినీ ప్రేమ కూడా కబళించడం ఒక కారణమే.
ఎంతో మంది చిన్నా, చితకా నటు జీవితాను బలి కోరేలా సినీమా రంగం
తయారైందనేది జగమెరిగిన సత్యం.
కేవలం అగ్రహీరోలు, నిర్మాతల కుటుంబాల నుండి వచ్చిన వారు తప్పితే, ఓ
మిడిల్ క్లాస్ నుండి వచ్చిన నటుకు ఈనాడు మనుగడ ఉందంటే అస్సలు నమ్మాల్సిన
పనిలేదనేది సినీ విశ్లేషకు మాట. తాజాగా బాలివుడ్ నటనలో తనదైన
ముద్రవేసుకున్న ధోనీ సినిమా హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య
చేసుకున్న ఉదంతం యావత్తు దేశంలో సినీ అభిమానులకు కంట నీరు తెప్పించింది.
అతడి అంతర్గత సమస్యలేవైనా ఒక మెరుపు మెరిసి రాలిపోయిన తారల జీవితాల్లో
సుశాంత్ కూడా చేరిపోయాడు. సినీ జీవితం అనేది తొలినాళ్లలో ఎంతటి
ఆనందాన్ని ఇస్తుందో, సగం జీవింలో మాత్రం కచ్ఛితంగా విషాదాన్ని
నింపుతుందనేది సుశాంత్ మృతితో మరోసారి రుజువైంది.
జీవితంలో ఎదుగుద ఆగితే చావే శరణ్యమా అనేది ఆలోచించాలని ఎంత మొత్తుకున్న
ఓ రంగు ప్రంచానికి అలవాటు పడ్డ వారికి మాత్రం అది రుచించదనేది నమ్మదగిన
నిజం.. రంగుల ప్రపంచంలో వినోదాల మాటున విషాదం నిత్యం అలముకుంటూనే ఉంది.
మెరుపు తారలు రాలిపోతుంటే, మిద్దిమీద కూర్చొన్న సీనియర్ నటులకు మాత్రం
సినీ పరిశ్రమ కష్టాంటే కేవం తమ వ్యాపార రంగానికి వచ్చిన కష్టాలే
ఎక్కువగా ఉండటం నేటి తరం నటుల దౌర్భాగ్యమే మరీ..