కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. ప్రభుత్వాలు
అప్రమత్తమవుతూనే ఉన్నాయి..కరోనా పై
ఎన్నడూ చూడని జాగ్రత్తలు..ఇంటి నుండి బయటకు రాని జనం. ఇవన్ని జీవనంలో
ఎన్నో మార్పులు తీసుకొచ్చాయి.
కాని జర్నలిస్టుల జీవితంలో మాత్రం నిబంధనలు గాలికి పోయి, మన ప్రాణాల
మీదకు తెస్తున్నాయి. విలేకరంటే స్పెషలే కదా..! ఆ ఛానల్ విలేకరి కావాల్సిన విజువల్స్,
ఎవరికి దక్కని ఫోటోలు, మరోక్కరికి దక్కరాదనేది ఎలాగో ఆసంస్థ మొదటి
నుండి వారి రక్తంలోకి ఎక్కించే భయంకరమైన విషం.
ఆ మత్తులో ఊగుతూ ఛానల్ గొప్పతనాన్ని యాజమాన్యం కంటే మనమే ఎక్కువగా
చెప్పుకుంటాం. మా ఛానల్ కరోనా అపడేట్‌లో ముందున్నాం..మా ఛానలైతే బ్రేకింగ్ తో
ఇరగ్గొడుతున్నామంటూ ఎవరికి వారు డబ్బాలు కొట్టుకోవడం షరా మాములై పోయింది.
.ఇప్పడు నిన్నెవరు కాపాడుతున్నారు. నువ్వు నమ్మిన యాజమాన్యమా..? లేక
నువ్వు వేలెత్తి ప్రశ్నించే ప్రభుత్వమా..నువ్వు హితం కోరే సమాజమా..?
అనేది నీకు నువ్వగా ప్రశ్నించుకుంటే మంచిది. బాబోయ్ మనోడికి
వచ్చిందట, ఇక మనం వాడిని కలవకపోవడం బెటర్..
ఇలా మనోళ్లే మనల్ని చూసి భయపడే రోజులు వస్తాయని ఎప్పుడైనా ఉహించామా..?
కాని ఆ మాటలు మన చెవులకే వినబడుతున్నాయి. కళ్లకే కనబడుతున్నాయి. నీ మీద
జాలి అనేది కపటమే. అది ప్రభుత్వమైనా..లేక నువ్వు పనిచేసే
సంస్థైనా. నిత్యం
రోడ్డు మీదే జీవితం గడిపే మనం ఇంటికి పోతే ఇల్లాలు, పిల్లల బాగోగులు, తల్లిదండ్రులను పట్టించు కోనంతగా
జర్నలిజం నలిగిపోతుంది.
ఇప్పుడున్న బడా సంస్థలు కనీసం సబ్ ఎడిటర్లకు జీతాలు కోసేసి పెద్ద మనస్సే
చాటుకున్నాయి. అధికారంలో ఉన్నప్పడు మనం రక్తం పిండి, కోట్లు
గడించిన వారు కూడా ఈరోజున కనీసం ఆసంస్థలో విలేకరికి ఒక్కరూపాయి
ఇచ్చి కరోనా కాలంలో
ఆదుకున్న పాపన పోలేదు. ఇక గ్రౌండ్ లో నీ రిపోర్టింగ్ నువ్వు టీవిలో
చూసుకోవడం, నువ్వు రాసింది నువ్వే చదువుకుని మురిసిపోవడం తప్పితే..
నలిగిపోతున్న, చిరిగిపోతున్న నీ జీవితానికి కుటుంబమే తోడనేది ఇప్పటికైనా
తెలుకుంటే మేలోయి.
కనీసం చేతుకు రాసుకునే శానిటైజర్ ఇవ్వని దౌర్భాగ్య
కంపెనీ ఎవరిని ఉద్ధరించేందుకు మనల్ని కష్టపెడతున్నాయో గ్రహించుకుంటే
చాలు. కార్పోరేట్ దిగ్గజాల చేతిలో జర్నలిజం నలిగిపోతుందన్నది ఎన్నటి
నుండో వినిపిస్తున్న మాట. అయితే ఇప్పుడు వారి పుణ్యమా అంటూ రోడ్లపైకి
వెళ్లిన మనం, రిపోర్టింగ్‌ను మాత్రం కైలాసం నుండి చేస్తామెమోననే ఆందోళన
మొదలైంది. టీవీ5 మనోజ్ జీవిత పాఠం నుండి ఎన్నో తెలుసుకున్నాం.
ప్రస్తుతం ఆ మహమ్మారి కూడా మన యాజమాన్యాల మాదిరిగానే వెంటాడుతూనే
ఉంది. ఒక్క హైదరాబాద్‌లోనే 23 మంది జర్నలిస్టుకు పాజిటీవ్ వచ్చింది.
ఇంకెంత మంది ఆజాబితాలో రాష్ట్రంలో ఇతర ప్రాంతాలలో పనిచేస్తున్న
మిగిలినవారు చేరితే ఇక భయానకమే. అలా జగకూడదనే దేవుడ్ని మొక్కుదాం.
ఏదో ప్రభుత్వాలు జర్నలిస్టులకు మేలు చేసేస్తాయని, మనల్ని మించినోడు ఇక
లేడనే విహంగ ఉహలకు పుల్‌స్టాప్ పెట్టుకుంటే మంచిది.
నీ కష్టాన్ని అమ్ముకునే సంస్థను నమ్ముకోకుండా, నిన్ను కనీసం
పట్టించుకోని ప్రభుత్వానికి ఎంత సేవ చేస్తే
మాత్రం ఉపయోగమేంటనేది గుర్తుంచుకుంటే ..బలుసాకైనా తిని బతకొచ్చు.