హైదరాబాద్ ,(ADITYA9NEWS): అజాది కా అమృత్ మహోత్సవం విశిష్టతను తెలిపేందుకు ఇండియా టూరిజం, హైదరాబాద్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఉమెన్ భారీ సైకిల్ ర్యాలీని నిర్వహించింది. జాతీయ గీతాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసే కేంద్ర ప్రభుత్వ విశిష్టతను తెలిపేందుకు ఈ అవగాహన ర్యాలీ చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారు. 75 వసంతాల స్వాతంత్య్ర విశిష్టతను తెలిపేందుకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఇదిలా ఉండగా జాతీయ గీతాన్ని కేంద్ర ప్రభుత్వం www.rastragan.in లో ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.
