విజయ్‌సాయిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ రఘురామ పిటిషిన్
హైదరాబాద్, (ADITYA9NEWS): వైసీపీ అగ్రనేతలకు కొరకురాని కొయ్యలా మారిన అదే పార్టీకి చెందిన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు, తాజాగా ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఇప్పటికే అక్రమ ఆస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన రఘు రామకృష్ణం రాజు దాటికి వైసీపీలో అలజడి రేగింది.
జగన్ బెయిల్ పిటిషన్ ఏమౌంతుదోనని ఆందోళన మొదలైంది. మరి కొద్ది రోజుల్లో ఈపిటిషన్‌పై తుది విచారణ జరుగుతుండగా, తాజా ఎంపీ విజయసాయి బెయిల్ కూడా రద్దు చేయాలని మరోసారి రఘు రామ కోర్టు కెళ్లడంతో వైసీపీ నేతలకు ఏం చేయాలో బోధపడటం లేదు. తాజాగా వేసిన పిటిషన్‌తో సీబీఐ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. క్విడ్ ప్రో కేసులో జగన్ A1 కాగా, విజయసాయి A2గా ఉన్నారు.