పోలీసు అంటేనే చాలా మందికి ఒక రకమైన వ్యతిరేక భావం ఉంటుంది. కఠువుగా
మాట్లాడతారని, సరియైన సమాధానం చెప్పరని, స్టేషన్ల చుట్టూ
తిప్పించుకుంటారని ఇలా రక రకాలుగా చెప్పుకోవడం సర్వసాధారణం. కాని
పోలీసులంతా ఒకేలా ఉండరని వారికి మనస్సు , మానవత్వం ఉంటుందని
నిరూపించాడు ఒక ఎస్సై. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణానికి
చెందిన అబ్డుల్ నబీ చూపిన మానవత్వం పోలీసుల్లో మంచి మనస్సు
ఉంటుందని చాటింది.
పిఠాపురం కోటగుమ్మం కూడలి వద్ద పట్ట పగలు 63 ఏళ్ల వృద్ధుడు ఆకస్మాత్తుగా
ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. కొద్దిసేపటికే అతడు మృతిచెందాడు. అతడు
చనిపోయాడనే విషయం ఎవ్వరికి తెలియదు. ఇంతలోగా సమచారం తెలుసుకున్న
ఎస్సై నబీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒక పక్క కరోనా భయంతో
వృద్ధుడిని ముట్టుకునేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు.
నిజంగా ఎస్ఐ తలచుకుంటే ఆయనతోపాటువచ్చిన పోలీసు సిబ్బందితోనైనా
మృతదేహాన్ని తరలించేలా ఆర్డర్ వేయచ్చు . కానీ పోలీసు సిబ్బంది
ఎవ్వరిని సాయం అడగలేదు. కనీసం మృతుడు ఏ రోగంతో చనిపోయాడనేది
పట్టించుకోలేదు. కేవలం అంబులెన్స్ సిబ్బంది ఒకరి తోడు తీసుకుని
మృతదేహాన్ని స్టక్చర్‌పై వేసి అంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి
తరలించారు. ఎస్సై మృతదేహాన్ని ధైర్యంగా పట్టుకుని తరలించిన తీరు
మానవత్వం ఇంకా బతికుందనే సందేశాన్ని ఇచ్చినట్లైయ్యింది. ఈఫొటోలు
వైరల్ కావడంతో నెటిజన్లు శభాష్ ఎస్సై నబీ అంటూ ఆయన చొరవకు హర్షం
వ్యక్తం చేస్తున్నారు.
