పైకి ఎంత సర్ధుబాటు చేసుకున్నప్పటికీ చైనా-భారత్‌ల మధ్య
సత్ససంబంధాలు కేవలం ప్రధానులు, అధ్యక్షులు ఆయా ప్రాంతాల్లో
పర్యనటలకు తప్పితే వాస్తవం అంతా నివురుగప్పిన నిప్పులా ఉందనేది
నమ్మాల్సిందే. తొలి నుండి చైనా భారత్ అడుగులను పసిగడుతూనే ఉంది.
జీన్‌పింగ్ అధ్యక్షుడైన తరువాత భారత్‌లో పర్యటించారు. ఎంతో
మర్యాదలు పొందాడు. కాని లాభమేముంది మళ్లీ విషపు పడగ విప్పక
తప్పలేదు. ఇరు దేశాల నేతలు కౌగిలింతలు చేసుకున్నప్పటికీ నిత్యం
చైనా-భారత్ సరిహద్దుల్లో సైనికులు మాత్రం అంతర్గతంగా యుద్ధం
చేసుకుంటూనే ఉన్నారు. భారత్ భూభాగంలోకి చైనా చొచ్చుకు రావడం, ఇటీవల
మన మిత్ర దేశంగా ఉన్న నేపాల్‌ను తన అడుగు జాడల వైపు చైనా తీసుకెళ్లడం
వెనుక పెద్ద వూహ్యమే పన్నింది డ్రాగన్ . భారత్‌పై అధిపత్యం
చెలాయించాలని ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న చైనా సరిహద్దుల గొడవను
అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించే ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఒక పక్క సైనిక చొరబాటుతో, ఆక్రమణలకు పాల్పడుతూ నెమ్మదిగా
భారత్ బోర్డర్‌లోకి అడుగు పెట్టాలని కుట్రలు పన్నుతోంది.
వాస్తవానికి 1950 నుండే ఆక్రమణలకు పాల్పడటం మొదలుపెట్టిన చైనా,
దలైలామా భారత్ లో ఆశ్రయం పొందినప్పటి నుండి భారత్ ను ఏదోలా
దెబ్బతీయడానికి వెంటాడుతూనే ఉంది. ప్రపంచ దేశాలను తమ గుప్పిట్లో
పెట్టుకోవాలని కుయుక్తులు పన్నుతున్న చైనాకు అమెరికా ఒక్కటే పెద్ద
అడ్డంకి. భారత్ అమెరికా సంబంధాలు మెరుగ్గానే ఉన్నప్పటికీ యుద్ధమంటూ
వస్తే అమెరికా భారత్ కు ఎంత వరకూ సహకరిస్తుందనే దానిపైనే భారత్
చైనాతో యుద్దానికి సిద్ధపడాలి. ఆర్థికంగా, సైన్య పరంగా చూస్తే భారత్
కంటే చైనాయే మెరుగ్గా ఉంది. అయితే భారత్‌కు ఉన్నంత ఇతర దేశాల మద్ధతు
మాత్రం చైనాకు లేవు. ఒక్క పాకిస్తాన్ మాత్రం భారత్‌పై ఉన్న ద్వేష
భావాలతో చైనాకు ప్రత్యక్షంగా సహకరిస్తుంది. సరిహద్దు తగదాలలో
చర్చలు చేస్తామంటూనే యుద్ధానికి కాలుదువ్వడం చైనాకు వెన్నతో పెట్టిన
విద్య. ఇటీవల కరోనా ప్రభావంతో చైనాపై నిప్పులు చెరిగిన అమెరికా
చైనాపై వ్యతిరేక భావనతో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం.
అమెరికా-భారత్ స్నేహం ఇలాగే కొనసాగితే డ్రాగన్ కు మాత్రం చుక్కలే.
____________________________________
తాజాగా లద్దాఖ్ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతో భారత్-చైనా సైనికుల
మధ్య తీవ్రతరమైన ఘర్షణ నెలకొంది. ఈనేపథ్యంలో భారత్‌కు చెందిన
కొంత మంది సైనికులను చైనా సైనికులు చంపడంతో భారత్ యావత్తు
దిగ్భ్రాంతికి లోనైయ్యింది. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన
కల్నల్ సంతోష్‌బాబు అమరుడయ్యాడు. వీరితో పాటు దేశంలో పలు
రాష్ట్రాలకు చెందిన సైనికులు ప్రాణాలు వదిలారు. వీరి మృతదేహాలను
స్వస్థలాలకు పంపిస్తున్నారు. అయితే చైనా సైనికులను మన వాళ్లు
మట్టుబెట్టడం జరిగింది. కాని ఆ వివరాలను చైనా ఇంకా వెల్లడించలేదు.
అమరవీరులకు ప్రధాని మోడీ, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు
కేసీఆర్, జగన్‌లు నివాళులర్పించారు.