వైసీపీలో ‘రాజు’ కున్న కుంపటి..!

 

 వైసీపీలో ఇంటి పోరు కాస్త వీధి పోరులా మారిపోయి చివరకు కుల పోరును తల‌పిస్తోంది.
ఒకేపార్టీలో రెండు గ్రూపులుగా మారి దిష్టిబొమ్మ‌లు ద‌గ్ధ‌దం చేసుకునే
వ‌ర‌కూ ప‌రిస్థితి వెళ్లింది. ఇందుకు మూల‌కార‌ణం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వైసీపీ ఎంపీ ప్ర‌భుత్వంపై రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాక్యలతో వివాదం మొద‌లైయ్యింది.  ఆయ‌న వైసీపీ ప్ర‌భుత్వ విధానాల‌ను ప్ర‌శ్నించ‌డం, న‌ర‌సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్ర‌సాద‌రాజు, ఎంపీ కృష్ణంరాజు తీరు స‌రికాదంటూ చేసిన వాక్య‌ల‌తో
 వైసీపీ వ‌ర్గ పోరు ర‌చ్చ‌కెక్కింది.  ముఖ్యంగా వైసీపీలో రెడ్డి హ‌వా
కొన‌సాగుతుంద‌ని, అన్ని పదవు వారికే చెందుతున్నాయని ర‌ఘురామ‌కృష్ణంరాజు చేసిన తీవ్రమైన బ‌హిరంగ విమ‌ర్శ‌లు కుల‌ కుంపటికి తెరలేపారు.

 ఎంపీ. వైసీపీ నేత జగన్‌తోపాటు, విజయసాయిరెడ్డి, నరసాపురం ఎమ్మెల్యే
ముదునూరి ప్రసాద్‌రాజు అనుసరిస్తున్న తీరును మీడియా ద్వారా బ‌హిర్గ‌తం చేసిన‌ తీరుపార్టీలో క‌ల‌క‌లం రేపింది.
ఒక పార్టీ ఎంపీగా అదే పార్టీపై చేస్తున్న మాటల‌ దాడి చూస్తుంటే అసలు
రఘురామకృష్ణం రాజు బీజేపీ రాజులా మారిపోయారా అన్నంతగా ఆయనపై విమర్శలు తీవ్ర‌త‌ర‌మ‌య్యాయి. వైసీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు తాజా అసెంబ్లీ సమావేశాల స‌మ‌యంలో ఎంపీ రఘురామకృష్ణంరాజు వైఖరిని ఎండగట్టారు. సొంతఅజెండా ఉంటే వేరేగా చూసుకోవాలి తప్పితే, పార్టీని విమర్శించడం ఎంపీకితగదని, జగన్ వల్ల గెల‌వలేదని చెబుతున్న ఎంపీ రాజీనామా చేసి మళ్లీ గెలవాల‌ని మాట్లాడారు. ఈ మాటల‌తో మరింత వేడేక్కిన  రఘురామకృష్ణంరాజు అసలు వీళ్లా నాకోసం మాట్లాడేదంటూ తీవ్రస్థాయిలో తిరుగుబాటు చేయ‌డంతో వివాదం ఆర‌డం లేదు.

రాజీనామా చేయాల‌ని చెబుతున్న వారు ముందుగా వారు  చేసి పార్టీలో గెల‌వమనండి
చూద్దామంటూ ఎంపీ సవాల్‌ విసిర‌డం మ‌రోప‌క్క వైసీపీ నాయ‌కులు
ర‌ఘురామ‌కృష్ణంరాజు దిష్టిబొమ్మ‌ల‌ను ద‌గ్ధం చేయడం వంటివి వెంట‌వెంట‌నే జ‌రిగిపోయాయి. వైసీపీలో రెడ్డి కులస్తుల‌దే హ‌వా అంటూ ఎంపీ
చేసిన  ప్రస్తావన పార్టీలో పెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది.  ఈ వ్య‌వ‌హారంలో
అధినేత జ‌గ‌న్ కూడా సీరియ‌స్‌గా ఉన్న‌ట్టు  స‌మాచారం. న‌ర‌సాపురం పంచాయ‌తీ అధినేత‌కు తల‌నొప్పిగా మార‌డంతో స‌మ‌స్య దిద్దుబాటు చ‌ర్య‌లు
 చేప‌ట్టిన‌ట్లు  తెలుస్తోంది.ఎంపీ, ఎమ్మెల్యేలు చేసుకుంటున్న
విమ‌ర్శ‌ల‌పై జ‌గ‌న్ నివేదిక కోరిన‌ట్లు స‌మాచారం.

ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు  బీజేపీ అగ్ర నేతతో ఉన్న పాత పరిచయం
దృష్ట్యా  ఢిల్లీలో  సొంతంగా చ‌క్రం తిప్ప‌డం పార్టీకి  ఇబ్బందిగా
మారింద‌న్న వాద‌నలు ఉన్నాయి.  పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్‌ అవ్వడం జగన్‌
కోటరీకి ఇష్టం లేదన్న ఎంపీ, అవ‌లంభిస్తున్న ఒంట‌రి  విధానం ఆది నుంచి పార్టీకి ఇబ్బందిగానే  ఉంది. జగన్‌ రఘురామకృష్ణంరాజును లెక్క చేయక‌పోవ‌డం ఇందుకు ఒక కార‌ణంగా చెబుతున్నారు.

ఆ తరువాత వైసీపీలోకి గోకరాజు గంగరాజు చేరిక, నరసాపురం
ఎమ్మెల్యే ప్ర‌సాద‌రాజుకు మంత్రి పదవీ వస్తుందంటూ ప్రచారంతో వైసీపీలో రఘురామకృష్ణంరాజు ఉన్నా లేనట్టుగానే పరిస్థితి మారిపోయింది. నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఎంపీ వేరు, ఎమ్మెల్యే వేరుగా క‌థ న‌డుస్తోంది. తదుపరి పరిణామాల‌ అనంతరం
రఘురామకృష్ణంరాజు ఇసుక, ఇతర ప్రజా సమస్యల‌పై వైసీపీ ప్ర‌భుత్వ‌ విధానాల‌కు
వ్యతిరేకంగా మాట్లాడటం, వైసీపీ నేత‌లపై నేరుగా కుల ప్ర‌స్తావ‌న‌తో
విమ‌ర్శ‌ల‌కు దిగ‌డం నాయ‌కుల‌కు రుచించ‌డం లేదు.

 ఈనేప‌థ్యంలో రఘురామకృష్ణంరాజు పై చ‌ర్య‌ల విష‌యంలో ఏలా ముందుకెళ్లాల‌నే
దానిపై వైసీపీ నేత‌లు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు.ఒక వేళ ఆయ‌న‌పై చర్యల‌కు ఉపక్రమిస్తే ఆయన బీజేపీలోకి చేరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. చ‌ర్య‌లు తీసుకోకపోతే పార్టీలో అస‌మ్మ‌తి వాదుల‌కు బ‌లం పెంచిన‌ట్ల‌వుతుంది. ఈప‌రిస్థితుల్లో   ఎంపీ సామాజిక వర్గాన్ని పూర్తిగా తమ పార్టీకి అనుకూంగా చేసుకున్నాక మాత్ర‌మే  ముందుకెళ్లడం మేల‌ని పార్టీ భావిస్తోన్న‌ట్లు స‌మాచారం. దీనిపై పార్టీ ఇంకా ఓ క్లారిటీకి రాకపోవడంతో మున్ముందు ఏం
జ‌రుగుతుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. మొత్తానికి వైసీపీలో రాజుకున్నకుంపటి మాత్రం పెద్ద చిచ్చేరేపింది.‍‍‍‍‍‍‍‍

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్