ఇక మీడియాలో కరోనా టైమ్ స్టాట్‌

ప్రాణాలు పోతున్న పట్టించుకోని యాజమన్యాలు..బల‌వ్వడానికే సిద్ధపడాల..?

సమాజంలో ఫోర్త్‌ ఎస్టేట్‌. అంద‌రూ గొప్ప‌గా చెపుతుంటే ఒక్క‌సారిగా మ‌న‌లో
మ‌నకే తెలియ‌ని ఆనందం కానీ, పేరు గొప్ప ఊరు దిబ్బలా ఉంది జర్నలిస్టు
జీవితం. దీనికి తోడు మీడియాలో క‌రోనా టైమ్ స్టాట్ అయ్యింది. తెలుగు
రాష్ట్రాలో అరకొర జీతాలిచ్చి పత్రికా యాజమాన్యాలు ఒక‌ప‌క్క‌ నమిలి
తినేస్తున్నాయి. జర్నలిస్టు సంక్షేమమా అంటే కేవ‌లం ప్ర‌క‌ట‌న‌ల్లోనే
ఇప్ప‌టి వ‌ర‌కూ వింటున్నాం.

అసలు సంక్షేమం ఉందనేది  పెద్ద డౌట‌నుమానం. ఆంధ్రప్రదేశ్‌లో  గత టీడీపీ
ప్రభుత్వంలో జ‌ర్న‌లిస్టు సంక్షేమం.. అబ్బో అదో పెద్ద క‌థే. 5 ఏళ్ల‌లో
కేవ‌లం రెండు పత్రిక యాజమాన్యా చేతిలో నలిగిపోయింది జర్నలిజం. ఆఫ్‌ కోజ్‌
ఇప్పటికీ అంతేననుకోండి.
ఇక తెంగాణాలో పైకి కిందకి ఊగీసలాడుతున్నారు మ‌నోళ్ళు.  అక్కడ మరలా పాత
ప్రభుత్వం కాబట్టి హామీలు అమలు కొనసాగొచ్చనే ఆశ ఇంకా చ‌చ్చిపోలేదు.  కాని
ఏపీలో పరిస్థితి విరుద్ధం. ఇక్కడ మీడియా అంటే అసలు ఉందా..? అనేలా
పరిస్థితి దాపురించింది. గ‌త ప్ర‌భుత్వం ఏదైతే చేసిందో దానికి ఏ మాత్రం
త‌గ్గ‌కుండా ప్ర‌స్తుత ప్ర‌భుత్వం జ‌ర్న‌లిస్టుల ప‌ట్ల బాగా
ప‌నిచేస్తోంది. కనీసం అక్రిడేషన్‌ కార్డుల‌కే ఇంకా దిక్కులేదు. ఇక భీమా,
ధీమా లాంటివి ఉన్నాయో, లేవో కూడా చాలా మందికి అర్థం కాని దుస్థితి.
జర్నలిస్టు వృత్తినే నమ్ముకుని నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నారు.

మనకు అందరూ తలొగ్గాల్సిందేనని మ‌నం అనుకోవ‌డం త‌ప్పితే మ‌న‌కు ఇక్క‌డ
మిగిలుతోంది బూడిదే. అక్క‌ర‌కురాని అహం ఏలాగో ఉంది కదా..! ఇక విష‌యం
చివ‌రికొస్తే కరోనా అంటే మనకేమైనా భయమా హెడ్‌లైన్‌లో పెట్టేసి,
బ్రేకింగ్ తో ఇరగదీస్తే పోలా..! ఇదే స్పీడుతో క‌రోనా కాలంలో మనోళ్లు
మొత్తం మరచిపోయి ఊరు వాడలా గుండా పిండిగా తిరిగేశారు. ఇంకేముంది ముప్పు
ముంచుకొచ్చింది ఆమహమ్మారికి ధనిక దేశా ప్రధానులే లెక్కలేదు. మ‌నం
ప్రెస్‌కార్డు చూపించినా ఆగ‌డం లేదు.
 మనవంతు వచ్చినట్టుంది వరుసగా దంపుడు మొద‌లైంది. జ‌ర్న‌లిస్టుల‌కి
టెస్టులు చేస్తుంటే పాజిటీవ్‌లే.  మన మనోజ్‌ అదేనండి టీవీ5 జర్నలిస్టు
క‌రోనాతో నింగికేగిశాడు. జర్నలిస్ట్‌కి ట్రీట్‌మంటే మాముగా ఉండదు కదా..!
అవిధంగా కట్టగలిపి  పైకి పంపించేశారు. ఇప్పుడు పెద్ద పత్రిక ఈనాడు
ప‌త్రిక వంతొచ్చింది. తాజాగా 16 మందికి ఈనాడు కార్యాల‌యంలో సిబ్బందికి
వచ్చిందంటూ వార్తలు జోరందుకున్నాయి. ఒక వేళ  16 మందా..ఇంకా త‌క్కువేనా
అనేది పక్కన పెడితే కరోనా ఎంటర్ అయిపోయింది. ఈనాడు కదా రాదనుకుని  ఉంటారు
 పెద్దలు  ఏలాగూ యాజమాన్యాల క‌థ మ‌న‌కు తెలిసిందే.

ఇప్ప‌డు  అయ్యో పాపం అనే మాట కూడా అక్కడ వినపడదు. సెల‌వు అనే మాట
అస్స‌లుండదు.  పోనీ రోగం ముదిరి సెల‌వు పెడితే జీతం ఉండదు. ఇంకా మనం
పట్టుబడితే మొత్తానికి ఉద్యోగానికే ఎస‌రు,  అలా అయిపోయింది అక్క‌డ‌.
గట్టిగా నిల‌దీసే జర్నలిస్టు సంఘాలు ఉన్నా లేన‌ట్టే. ఒక వేళ సంఘాలు
గట్టిగా నిల‌దీస్తే ఏ పేపర్లోనూ ఆ వార్త మాత్ర‌మే రాదు. ప్రభుత్వాలు
యాజమాన్యాల‌కు మద్ధతిస్తే, అసలు పోరాటాలు ఎవరిపైన చేయాలి, ఎందుకు
చేయాలి.? అందుకే జర్నలిస్టు సంక్షేమం అంటే అంతగా లోకువైపోయింది.
ఇప్పటికైనా మేల్కొని ఒంటిమీద‌వి చించుకోకుండా ఎవడి ప్రాణాలు వాడు
కాపాడుకోవటమే మ‌న‌కు మ‌నం చేసుకునే మేలు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :