ఏపీలో పలువురు పోలీసులు పదోన్నతి పొందారు. రాష్ట్రంలోని 40 మంది డీఎస్పీలకు ఏఎస్పీలుగా పదోన్నతి లభించింది. ఐదుగురు ఏఎస్పీలకు నాన్ క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 31 మంది జిల్లా జడ్జీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
