సంతోష్ కుటుంబం వద్దకు నేరుగా వెళ్లిన ముఖ్యమంత్రి..ఉహించని సాయం
తెలంగాణా రాష్ట్రం సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ దేశం కోసం పోరాడి
అమరుడయ్యాడు. చైనా సైనికుల దొంగ దెబ్బకు బలయ్యాడు. యావత్తు దేశం
కల్నల్ సంతోష్ బాబుకు ఘన నివాళులర్పించింది. ఇదంతా ఒకెత్తు. కాని
రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేవలం నివాళే కాదు. సంతోష్ కుటుంబానికి జీవిత
భరోసా కల్పించారు. సాయం చేస్తాం..అండగా ఉంటాం అనే మాటలు చెప్పి
మరచిపోయే, నాయకుల నోట మాట రాకుండా చేశారు. ఆ సైనిక కుటుంబానికి అన్ని
స్పాట్‌లోనే చేసి వావ్ అనిపించారు. ఉహించని విధంగా సాయమందించారు.
నిజమైన దేశ భక్తి చాటి శభాష్ అనిపించుకున్నారు కేసీఆర్.
భారత్ – చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో మరణించిన కల్నల్ బిక్కుమళ్ల
సంతోష్ బాబు నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్, కల్నల్ సంతోష్
బాబు భార్య సంతోషి, తల్లిదండ్రులు మంజుల, ఉపేందర్, సోదరి శృతిలను
ఓదార్చారు. సంతోష్ పిల్లలు, అభిగ్న, అనిరుధ్ తేజలతో స్వయంగా మాట్లాడి
బాగోగులు తెలుసుకున్నారు.
సంతోష్ మరణం తనను ఎంతగానో కలచివేసిందన్న ముఖ్యమంత్రి ఆయన కుటుంబానికి
ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా ఉంటుందన్నారు. సంతోష్‌బాబు భార్య సంతోషీకి
గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చే నియామక పత్రాన్ని ముఖ్యమంత్రి స్వయంగా అందజేశారు.
హైదరాబాద్ బంజార్ హిల్స్ లో 711 గజాల స్థలానికి సంబంధించిన పత్రాన్ని
కూడా అక్కడికక్కడే అందించారు.
సంతోష్ భార్యకు రూ. 4 కోట్ల చెక్కును, అతడి తల్లితండ్రులకు రూ.1 కోటి
చెక్కును అందజేసి మరో సైనికుడనిపించుకున్నారు.
