పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా జిల్లాలో ఈనెల 25 నుండి లాక్ డౌన్‌ను
విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డి. మురళీధరరెడ్డి తెలిపారు.
ఈమేరకు నిబంధనలను విడుదల చేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ
లాక్ డౌన్ కొనసాగుతుందని తెలిపారు

* ఈనెల 25 నుండి ఉదయం 6 నుండి 11 గంటల వరకూ మాత్రమే ప్రజలు
బయటకు వచ్చేందుకు అనుమతి
* దేవాలయాలు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ వంటివి కూడా కేవలం 6 నుండి
11 గంటల వరకూ మాత్రమే తెరవాలి
* ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు యధావిధిగా పనిచేసుకోవచ్చు.
* పాఠశాలలు, కోచింగ్ సెంటర్లు, కళాశాలలు మూసివేయాలి
* రెస్టారెంట్లు, హోటళ్లలో ఉదయం 11 గంటల వరకూ మాత్రమే పార్సిల్స్‌కు అనుమతి
* జిల్లా నుండి ఇతర జిల్లాలకు ఎటువంటి రవాణా సౌకర్యం లేదు.(మెడికల్
మినహాయించి)
* లిక్కర్, పాన్, గుట్కా లకు పబ్లిక్ స్థలాలలో అనుమతి లేదు.
* ఉదయం 11 గంటల వరకూ మాత్రమే లిక్కర్ దుకాణాలకు అనుమతి
* ఉదయం 11 తరువాత బయటకు వస్తే కేసులు నమోదు చేస్తారు.
