నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఒక వర్గానికి సపోర్టుగా పనిచేస్తున్నారు.
ఆయన కులానికి చెందిన వారికి అనుకూలంగా పనిచేస్తున్నారు.చంద్రబాబు కొంత మంది ద్వారా ఇంకా వ్యవస్థలనునీరుగార్చాలని చూస్తున్నారు. అధికారంటే కుల,మతాలకు అతీతంగా పనిచేయాలి. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తీరు చూస్తుంటే అంతా ఆయనే
అనుకుంటున్నారు. కనీస సమాచారం ప్రభుత్వానికి . ఇవ్వకపోవడం
బాధాకరం. ప్రజాస్వామ్యంలో అధికారి ఇలా చేయొచ్చా. చంద్రబాబు సామాజిక వర్గమే అయినా, రమేష్‌కుమార్ ఇలా వ్యవహరించడం దారుణం. ఎన్నికల వాయిదా ప్రకటనతో నిమ్మగడ్డ తీరుపై ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు
అక్కడ నుండి మొదలైన రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషనర్ మధ్య యుద్ధం కాస్తా
ఎన్నికల కమిషన్ పదవీ కాలం కుదింపునకు దారి తీసింది. రమేశ్ కుమార్ పై పట్టుదలతో ఆర్డీనెన్స్ ఆయుధంతో ప్రభుత్వం పై చేయి సాధించింది. అదే సమయంలో కొత్త ఎన్నికల కమిషనర్‌గా కనగరాజు బాధ్యతలు వెనువెంటనే చేపట్టడం జరిగిపోయింది. తదనంతరం నిమ్మగడ్డ రమేష్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించడంతో ఆయనకు అనుకూలంగా తీర్పు
రావడంతో ప్రభుత్వానికి మొట్టికాయ పడింది. ఆపై మరలా ప్రభుత్వం
సుప్రీం కోర్టుకు వెళ్లడంతో కథ ఇంకా సస్పెన్స్‌లోనే ఉంది…..
సీన్‌కట్ చేస్తే,
సుప్రీంలో కేసు నడుస్తున్నప్పటికీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తనకు
అనుకూలంగా హైకోర్టులో వచ్చిన తీర్పును అమలు చేయాలని
అభ్యర్థించేందుకు సిద్ధ పడుతున్నాడు. అయితే నిమ్మగడ్డకు అనుకూలంగా
కొంత మంది టీడీపీ, బీజేపీ నేతలు కోర్టుల్లో పిటీషన్లు వేసినా అది
ప్రతిపక్షాల పాత్ర కోటా కిందకు వెళ్లిపోయాయి. నిమ్మగడ్డ టీడీపీ
అనుకూల వ్యక్తి అంటూ ఆరోపణలు తప్పితే ఇప్పటి వరకూ ఎటువంటి
ఆధారాలను చూపలేకపోయింది వైసీపీ.
తాజాగా హైదరాబాద్‌లో పార్క్ హయాత్ హోటళ్లో, టీడీపీలో ఉండి
బీజేపీలోకి వెళ్ళిన సుజనా చౌదరి, బీజేపీ పొత్తుతో గత టీడీపీ హయాంలో
మంత్రిగా పనిచేసిన కామినేని శ్రీనివాసరావులతో నిమ్మగడ్డ రహస్య
భేటి సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన సీసీ పుటేజీ వీడియోలు
బయటకు రావడంతో నిమ్మగడ్డ వెనుక ఆయన సామాజిక వర్గం బలం ఉందనే
ఆరోపణలకు మరింత బలం చేకూరింది.
జగన్ గతంలో ఆరోపించిన వ్యాఖ్యలకు తగ్గట్టుగా కుల రాజకీయంలో
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చంద్రబాబు వర్గానికి అనుకూలంగా
పనిచేస్తున్నారన్న వాదనకు , ఇప్పుడు బయట పడ్డ వీడియోలు నిజమనేలా
ఉన్నాయి. ఈవీడియోలు కోర్టులో వైసీపీకి ఆధారంలా
పనిచేస్తాయా..చేయవా..అనేది పక్కన పెడితే ఒక రాజ్యాంగ పదవికి
న్యాయం చేయాల్సిన వ్యక్తి రాజకీయ ప్రమేయంతో
చేస్తున్న ఈప్రయోగాలపై ఇప్పుడు విమర్శలు ఎక్కువయ్యాయి. గతంలో కరోనా
విషయంలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తీసుకున్న ఎన్నికల వాయిదా అంశం
సరియైనదేనని ఎక్కువ శాతం ఆయనకు పరోక్ష మద్ధతు తెలిపారు. కరోనా
పరిస్థితులు కూడా నిమ్మగడ్డకు అనుకూలంగా రావడంతో ఇప్పటి వరకూ
ఆయనదే పై చేయి.
కానీ ఇప్పడు ప్రైవేటు బేటి మాత్రం గతంలో వైసీపీ నేతలు చేసిన ప్రతీ
ఆరోపణ నిజమయ్యేలా పరిస్థితి మారిపోవడం వైసీపీకి బాగా కలిసొచ్చే
అంశం. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను కలవడం అనేది తప్పు కాకపోయినా,
నిమ్మగడ్డపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రత్యేకంగా హోటల్‌లో ఒకే
సామాజిక వర్గం నేతలతో బేటి కావడం రమేశ్‌కుమార్ వెనకున్నకుల
శక్తుల రాజకీయంపై అందర్ని ఆలోచనలో పడేసింది.
వీరి కలయిక వీడియోలు బయటకు రావడంతో ఒక పక్క బీజేపీ రాష్ట్ర
నాయకత్వం, మరోపక్క టీడీపీ ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం
తలలు పట్టుకుంటున్నారు. అంతకముందు వరకూ ఒకే బాటలో ఉన్న టీడీపీ,
బీజేపీఎన్నికల ముందు ప్రత్యర్థులుగా మారిపోయారు. ఆ తరువాత అంతర్గత
స్నేహం కొనసాగడం , ఇటీవల చంద్రబాబు కేంద్రం పనితీరును
తెగపొగిడేయడం మరలా బీజేపీ, టీడీపీ స్నేహాం చిగురిస్తుందా అనే
అనుమానాలకు తెరలేపింది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ మాజీ నేతలైన
ప్రస్తుత బీజేపీ నేత సుజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని కలయిక
కొత్తమలుపు తిప్పింది. వారిద్దరూ ఒకే పార్టీ అయినా చంద్రబాబు
చెప్పిందే వేదంగా వారి నడవడిక ఉంటుందనే ప్రచారం లేకపోలేదు. పైగా
వీరంతా ఒకే సామాజిక వర్గం. ప్రస్తుతం వీడియోలు బయటకు రావడం ఇటు
టీడీపీ, అటు బీజేపీని ఇరకాటంలో పడ్డాయి. దీన్ని కవర్ చేసేందుకు
ఇప్పటికే రంగంలోకి దిగిన టీడీపీ నాయకులు వారి భేటీ తప్పుకాదని టీవీ
డిబేట్లతో నమ్మించడానికి నానా తంటాలు పడుతున్నారు.
కోర్టుల తీర్పు నిమ్మగడ్డకు అనుకూలంగా వస్తున్న నేపథ్యంలో ,
టీడీపీకి అనుకూల వ్యక్తిగా, చంద్రబాబు సామాజిక వర్గానికి
కొమ్ముకాస్తున్న వ్యక్తిగా నిమ్మగడ్డ జాతకం బయట పెట్టేందుకు
వైసీపీకి దొరికిన ఈ సీక్రెట్ మీటింగ్ అంశాన్ని వైసీపీ ఏలా
వాడుకుంటుందనేది మాత్రం ఆసక్తి కరంగా మారింది.