ఒకే చోట నివాసమున్న 34 మందికి పాజిటీవ్
తూర్పుగోదావరి జిల్లాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. సామర్లకోట
మున్సిపాల్టీలో అమ్మణమ్మ అపార్ట్ మెంట్ లో నివాసముండే రాఘవమ్మ (72) వృద్ధురాలికి
ఇటీవల జ్వరం ఉండటంతో కరోనా లక్షణాలుగా అనుమానించి పరీక్షలు
చేశారు వైద్యులు. పరీక్షలో కరోనా పాజిటీవ్‌గా నిర్థారణ అయ్యింది.
అయితే అప్పటికే ఆమె చనిపోయింది. అనంతరం అధికారులు వృద్ధురాలు
నివాసమున్న బ్లాక్‌లో వారందరికి , ఈనెల 21న పరీక్షలు నిర్వహించారు.
89 మందికి కరోనా టెస్ట్‌లు చేయించగా. వారిలో 34 మందికి పాజిటీవ్
నిర్థారణ కావడంతో అధికారులు హడలిపోతున్నారు. ఒకపక్క అపార్ట్‌మెంట్
వద్ద పారిశుద్ధ్య, వైద్య సిబ్బంది సేవలను అందిస్తున్నారు.
చుట్టుపక్కల ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా చేసి, ఎక్కడికక్కడ వైరస్
వ్యాప్తి లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్
డి.మురళీధరరెడ్డి ఆదేశాలమేరకు మున్సిపల్ , రెవిన్యూ అధికారులు
అపార్ట్‌మెంట్ వద్ద అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడికక్కడ
బార్‌కేడ్‌లు ఏర్పాటు చేసి అటువైపు రాకపోకలు నిలిపివేశారు.

