“మీ పెద్దోళ్లున్నారే.. మా చిన్నోళ్లకు ఏం కావాలో ఎప్పటికీ తెలుసుకోలేరు”
అంటూ భిన్నమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల్లో చెరగని ముద్రవేశాడు హీరో
ఉదయ్ కిరణ్.
వరుసగా మూడు భారీ విజయాలు అందుకుని లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు.
ఈ హీరో (జూన్ 26) 40వ జయంతి ఈరోజు. ఈ సందర్భంగా అతడి గురించి పలు విశేషాలు మీకోసం.
ఉదయించాడిలా..!
1980 జూన్ 26న హైదరాబాద్లో జన్మించాడు ఉదయ్ కిరణ్. సికింద్రాబాద్ వెస్లీ
కాలేజ్లో డిగ్రీ పూర్తి చేశాడు.
అనంతరం మోడలింగ్ మొదలుపెట్టి సినిమాలపై మక్కువతో చిత్రసీమలో
అడుగుపెట్టాడు. ఉషాకిరణ్ మూవీస్ సంస్థ నిర్మాణంలో తేజ దర్శకత్వం వహించిన
‘చిత్రం’ సినిమాతో తెరంగేట్రం చేశాడు ఉదయ్.
రెండో సినిమా ‘నువ్వు-నేను’.. తేజ దర్శకత్వంలోనే నటించాడు. ఆ చిత్రానికి
ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నాడు. అనంతరం ‘మనసంతా నువ్వే’
చిత్రంతో హ్యాట్రిక్ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ‘కలుసుకోవాలని’, ‘నీ
స్నేహం’, ‘శ్రీరామ్’ లాంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.
అవార్డుల పంట
నువ్వు-నేను చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు
దక్కించుకున్నాడు. అతి చిన్న వయసులో(21 ఏళ్లు) ఈ పురస్కారం అందుకున్న
హీరోగా ఘనత సాధించాడు. ఇప్పటికీ అతడి పేరు మీదే ఈ రికార్డు ఉంది.
వైఫల్యాలు వెంట
2002లో విడుదలైన ‘నీ స్నేహం’ చిత్రమే ఉదయ్ కెరీర్లో చివరి విజయం.
తెలుగుతో పాటు తమిళంలోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. పొయ్’, ‘వాంబు
శాండై’, ‘పెన్ సింగమ్’ లాంటి చిత్రాల్లో నటించాడు. అయినా విజయాలు
అంతంతమాత్రమే. ఆ తరువాత సినీ అవకాశాలు నెమ్మదిగా తగ్గాయి. ఉహించని
జీవితం దగ్గరైనట్టే అయ్యి అందకుండా పోయింది. ఆపై మానసిక ఒత్తిడితో
సతమతయ్యాడు.
చివరాంకం
2014లో విషిత అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత సినీ
కష్టాలు మరింతగా పెరిగిపోయాయి. ఉదయ్‌కిరణ్ కు అవకాశాలు రాకుండా
చేశారు. చేసిన సినిమాలు వరుస ఫ్లాఫ్లు, ఆర్థిక ఇబ్బందులతో పూర్తిగా
కూరుకుపోయాడు ఉదయ్. మానసిక ఒత్తిడికిలోనై 2014 జనవరి 5న అద్దెకు
ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఉదయ్ కిరణ్ మరణం చిత్రసీమలో, అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
ఎంతో ఎత్తుకు ఎదుగుతాడనుకున్న ఉదయ్‌కిరణ్ 33 ఏళ్ల వయసులోనే తనువు
చాలించాడు….ఉదయ్ ఆత్మ శాంతించాలని కోరుకుందాం…
