తూర్పులో క‌రోనా రికార్డులు బ్రేక్

తూర్పుగోదావ‌రి జిల్లాలో కొవిడ్‌ విలయం సృష్టిస్తోంది. ఊహకందని వేగంతో మహమ్మారి
పరుగులు తీస్తోంది. రోజుకీ వెయ్యికి త‌గ్గ‌కుండా కేసులు న‌మోదవుతున్నాయి. క‌ర్నూలును మించిన జిల్లాగా తూర్పుగోదావ‌రికి దూసుకుపోతుంది. వైర‌స్ ఏవిధంగా దాడి చేస్తోందో కూడా అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది. ఎందుకు ఇన్ని కేసులు నమోదవుతున్నాయో.. మూలాలు ఎక్కడ్నించి ఎలా వ్యాపిస్తున్నాయో వైద్యులు, అధికారులకు అంతు చిక్కట్లేదు. ఆదివారం కొత్తగా 1,543 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో 31వేల 703కి మొత్తం పాజిటివ్‌ కేసులు చేరాయి.

ఒక్క‌రోజులో 1299 కి ఊర‌ట‌

ఈరోజుకు మరో ప్రత్యేక కూడా ఉంది. ఈ రోజు ఒక్కరోజే రికార్డు స్థాయిలో 1,299 మంది కరోనా నుంచి కోలుకున్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ కరోనా నుంచి 17వేల 446 మంది కోలుకున్నారు. జిల్లాలో క‌రోనా వ్యాప్తి పెరుగుతున్న‌ప్ప‌టికీ త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామ‌ని అధికారులు చెబుతున్నారు. క‌రోనా నుండి కోలుకున్న వారి సంఖ్య పెరుగుతుంద‌ని ఆందోళన చెందాల్సిన ప‌నిలేద‌ని చెబుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :