రానున్న జనవరి నెలలో పోలీసుశాఖ, అగ్నిమాపకశాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఈవిషయాన్ని స్వయంగా రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. 11,500 ఉద్యోగాలకు సంబంధించి ఒకేసారి భారీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు ప్రారంభం కావడంతో నిరుద్యోగుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. జగన్ అధికారం చేపట్టాక అత్యధికంగా నిరుద్యగోతపైనే ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా రెండు లక్షల పైగా సచివాలయ సిబ్బందిని నియమించిన జగన్, పోలీసుశాఖలో కూడా ఖాళీలు భర్తీ చేసి తన మార్కు చాటాలనుకుంటున్నారు.ఈ నియామకాలకు ఈ సారి ఎటువంటి అర్హత పరీక్షలు పెడతారనే సమాచారాన్ని ముందుగా తెలియజేస్తే బాగుంటుందని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
