నెల్లూరు: ఈ ఏడాది రెండవ రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. ఈరోజు మధ్యాహ్నం 2:41 గంటలకు పీఎస్‌ఎల్వీసీ-50 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ మొదలుకానుంది. దాదాపు 25 గంటల కౌంట్‌డౌన్ తర్వాత రేపు మధ్యాహ్నం 3:41 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి50 వాహకనౌక నింగిలోకీ నిప్పులు విరజిమ్ముతూ దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగం ద్వారా శాస్త్రవేత్తలు 1,410 కిలోల బరువు గల కమ్యూనికేషన్ శాటిలైట్ సీఎంఎస్-01ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.
