* ఇకపై సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు
ఆంధ్రప్రదేశ్‌లో ఇకపై ఆస్తుల రిజిస్ట్రేషన్లు గ్రామ, వార్డు సచివాలయాల్లోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం పైలట్ ప్రాజెక్టుగా కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలంలోని తకెళ్లపాడు గ్రామ సచివాలయాన్ని ఎంపిక చేశారు.తదుపరి రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల్లో అమలు చేయనున్నారు. ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి పంచాయతీ కార్యదర్శి సబ్-రిజిస్ట్రార్‌గ వ్యవహరిస్తారు. డిజిటల్ అసిస్టెంట్ అసిస్టెంట్ సబ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చూస్తారు.
* చింతపల్లిలో 9.5 కనిష్ఠ ఉష్ణోగ్రత
రాష్ట్రంలో చలితీవ్రతకు విశాఖ ఏజెన్సీ అద్దం పడుతోంది. చింతపల్లిలో కనిష్టంగా 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైయింది. మినుగూరులో 10 డిగ్రీలు, అరకులో 14 డిగ్రీలుగా కనిష్టస్థాయికి ఉష్ణొగ్రతలు చేరుకోవడంతో ఏజెన్సీ వాసులు వణుకుతున్నారు. ఈ ఉష్ణొగ్రతను మాత్రం పర్యాటకులు ఆస్వాధిస్తున్నారు.
* భూములు స్వాధీనం అనేది బాబు దుష్ప్రచారమే : విజయసాయి
టిడీపీ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోచుకున్న భూములను మాత్రమే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. విశాఖలో ఆయన మంత్రి అవంతి శ్రీనివాసరావుతో కలిపి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు బంధువులకు ప్రభుత్వ భూములు కట్టబెట్టారని వాటిని స్వాధీనం చేసుకుంటుంటే దుష్ప్రచారానికి బాబు ఒడిగట్టారని విజయసాయి ఆరోపించారు.
* దివీస్‌పై ప్రభుత్వం మోసం : యనమల
తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో ప్రముఖ ఫార్మా కంపెనీ దివీస్ ఏర్పాటు ప్రజలకు ఇష్టం లేకపోయినా ప్రభుత్వం తప్పడు ప్రకటనలతో ముందుకెళ్తుందన్నారు. దివీస్‌ను వేరే ప్రాంతానికి తరలిస్తున్నట్లు ప్రభుత్వం ఎక్కడా ప్రకటన చేయలేదన్నారు. దివీస్ వల్ల ఆక్వా పరిశ్రమ దెబ్బతిని యువత ఉపాధి కోల్పోతుందన్నారు.