బిగ్‌బాస్ సీజన్ -4 విజేతగా అభిజిత్ నిలిచారు. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫైనల్‌కి అఖిల్, అభిజిత్, సోహెల్, హారిక, అరియానా చేరుకున్నారు. వీరిలో హారిక, అరియానాలను ఎలిమినేట్ చేయగా, రూ.25 లక్షల నగదు ఆఫర్ తీసుకుని సోహెల్ స్వచ్ఛందంగా వచ్చేశారు. దీంతో చిట్ట చివరగా అభిజిత్, అఖిల్ ఫైనల్‌కు చేరుకున్నారు. చిరంజీవి ముఖ్య అతిధిగా వచ్చి బిగ్‌బాస్ సీజన్-4లో పాల్గొన్నవారందరికి ఉత్సాహాన్ని నింపారు. చివరకు ఫైనల్ విజేతగా అభిజిత్‌ను, రన్నర్‌గా అఖిల్‌ను ఎంపిక చేశారు. విజేత అభిజిత్‌నకు ట్రోఫీతోపాటు, రూ.25 లక్షల నగదును అందజేశారు. బిగ్‌బాస్ సీజన్-4లో తొలుత 16 మందితో ప్రారంభమైన ఈ రియాల్టీ షో లో మొత్తంగా 19 మంది పోటీలో పాల్గొన్నారు. 105 రోజుల పాటు రియాల్టీ షో కొనసాగింది.
