*అన్నాట్టే* ఇప్ప‌ట్లో లేన‌ట్టే..!

చెన్నై(ADITYA9NEWS): సూప‌ర్‌స్టార్ రజనీకాంత్ తాజా తమిళ చిత్రం ‘అన్నాట్టే సినిమాకు మరోసారి ఉహించ‌ని దెబ్బ త‌గిలింది. కరోనావైరస్ మహమ్మారి ప్ర‌భావంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది. గ‌తంలో కరోనా, లాక్‌డౌన్‌ ఆంక్షలతో దీర్ఘకాలంగా వాయిదా పడి, ఇటీవలే తిరిగి ప్రారంభమైన షూటింగ్‌కు మళ్లీ బ్రేకులు పడ్డాయి. ఈ మూవీ సెట్లో ఉన్న కొంత మందికి క‌రోనా సోక‌డంతో అన్నాట్టే షూటింగ్ నిలిపిశారు. యూనిట్‌లో ఏకంగా ఎనిమిది మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన‌ట్లు స‌మాచారం.

ర‌జ‌నీకాంత్‌కు స‌మీపంగా మెలిగిన సిబ్బంది ఉండ‌టంతో అంద‌రిలో కంగారు మొద‌లైంది. డిసెంబ‌ర్ 14 నుండి హైద‌రాబాద్ రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జ‌రుగుతుండ‌గా క‌రోనా ప‌రిణామాల‌తో ర‌జ‌నీ చెన్నైకి తిరుగుప్ర‌యాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ర‌జ‌నీకాంత్ త‌మిళ‌నాడులో కొత్త‌గా పార్టీ ఏర్పాటు చేస్తుండ‌టంతో వీలైనంత త్వ‌ర‌గా హైద‌రాబాద్‌లో షూటింగ్ పూర్తి చేయాల‌నుకున్నారు. కాని క‌రోనా మాత్రం ఈ సినిమాకు ఆటంకాలు తెస్తూనే ఉంది.

అన్నాట్టే తమిళనాడులోని లోతట్టు ప్రాంతాలలో గ్రామీణ నేపథ్యం ఉన్న కథగా తెరకెక్కుతోంది. సిరుతై శివ దర్శకత్వంలో, సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నఈ చిత్రంలో నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్భు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :