అమరావతి (ADITYA9EWS):తుఫాన్ ప్రభావం వల్ల నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని, తక్షణమే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలన్న డిమాండ్‌తో జనసేన ఆందోళన బాట పట్టింది. ఈనెల 28న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా పవన్ ప్రకటిస్తూ ప్రకటన లేఖ విడుదల చేశారు.
రైతులకు పరిహారంగా రూ.35 వేలు అందించాలని, తక్షణ సాయంగా 10 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈనెల 28న కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌ను కలిసి పవన్ వినతిపత్రం ఇవనున్నట్లు తెలిపారు. 17 లక్షల 30 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని రైతులును ఆదుకోవాలని జనసేనాని డిమాండ్ చేశారు.