హైదరబాద్(ADITYA9NEWS):కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో తొలిదశగా తెలంగాణా సర్కార్ బడులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా 1వ తరగతి నుండి 5వ తరగతి వరకూ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తెలంగాణాలో వైరస్ వ్యాప్తి జరగకుండా ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. వైరస్ వ్యాప్త ఉంటుందన్న వార్తలతో అప్రమత్తమైన సర్కార్ బడులకు వరుస సెలవులను పొడిగించింది. ప్రైవేటు పాఠశాలలకు ఈ సెలవుల నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. ఇప్పటికే యుకే నుండి వచ్చిన సుమారు 1200 మందిని అబ్జర్వేషన్‌లో ఉంచిన ప్రభుత్వం విద్యార్థుల పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
