తూ.గో.జిల్లా కాకినాడ సమీపం కొమరగిరి వేదిక
కాకినాడ(ADITYA9NEWS):ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత నవరత్నాల పథకాలలో అతి ప్రతిష్టాత్మకమైన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఎట్టకేలకు శుభం కాబోతుంది. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడ్డ ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 25, శుక్రవారం కాకినాడ సమీపం కొమరగిరి గ్రామం వేదికగా నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా అర్హులకు ఇళ్ల పట్టాల పంపిణీ జరగనుంది. మధ్యాహ్నాం 1.30 నిమిషాలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగంతో కార్యక్రమం ముగుస్తుంది. ఈమేరకు జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి, అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి సభకు భారీగా జనసమీకరణ చేసేందుకు ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేశారు.