తిరుపతి(ADITYA9NEWS): తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనం పది రోజుల పాటు ఉండనుంది. భక్తుల రద్దీ దృష్ట్యా రోజుకి 10 వేల చొప్పన టోకెన్లను అందించి లక్ష వరకూ భక్తలకు దర్శన భాగ్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ ఏడాది స్వామివారి దయతో కల్యాణమస్తు కార్యక్రమాన్ని తితిదే ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. కల్యాణమస్తు కార్యక్రమం ద్వారా పెళ్లి చేసుకునే జంటలకు దుస్తులు, మంగళసూత్రాలు, భోజనాల సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు.