ఏపీలో 15 రోజులు ఇళ్ల ప‌ట్టాల పండగే

రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల 75 వేల ఇళ్ల పట్టాలు పంపిణీ

కాకినాడ‌(ADITYA9NEWS): రాష్ట్రవ్యాప్తంగా 15 రోజుల పాటు ఇళ్ల ప‌ట్టాల పండుగ జ‌రుగుతుంద‌ని ముఖ్య‌మంత్రి వై ఎస్ జ‌గ‌న్ అన్నారు. కాకినాడ స‌మీపం పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలోని కొమ‌రగిరి గ్రామంలో ఇళ్ల ప‌ట్టాల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ ..రాష్ట్ర‌వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 15 రోజుల పాటు ఇళ్ల పట్టాల పంపిణీ పండుగ కార్యక్రమం జ‌రుపుకోవాలి, టిడ్కో ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల 2.62 ఇళ్లకు సేల్ అగ్రిమెంట్లు
చేస్తాం. కేవ‌లం అర్హతే ప్రామాణిక‌త‌, కులాలు, మతాలు చుడటం ఉండ‌దు.రాష్ట్రంలో 17 వేలకు పైగా వైఎస్సార్‌ జగనన్న కాలనీలు నిర్మిస్తాం అంటూ హామీ ఇచ్చారు. కొత్త కాలనీలో తాగునీరు, రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ వంటి సౌకర్యాలు కల్పిస్తాం.స్థలం ఇవ్వటమే కాదు ఇల్లు కట్టించడం ప్ర‌భుత్వం ముందున్న ల‌క్ష్యంగా జ‌గ‌న్ చెప్పుకొచ్చారు.

ల‌బ్దిదారుల‌దే ఛాయిస్‌..

*మొదటి దశ ఇంటికి కావలసినసామాగ్రిని ప్రభుత్వమే సమకూరుస్తుంది, లేబర్ కు అవే ఖర్చు మీరు భరించాలి.

* రెండవ దశ ఇంటి సామాగ్రిని అంతా మీరే సమకూర్చుకుంటే కట్టడానికి కావలసిన ఖర్చును
ప్రభుత్వమే భరిస్తుంది.

* మూడవ దశ మాకు ఇవన్నీ తెలియదు అనుకుంటే, పూర్తిగా ప్రభుత్వమే భరించి దశలవారీగా ఇళ్ల నిర్మాణం చేస్తుంది. ఏది కావాలో ల‌బ్ధిదారుల ఇష్టంపై ఆధార‌ప‌డుతుంద‌ని జ‌గ‌న్ అన్నారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :