- చెన్నై(ADITYA9NEWS): నాన్న మీ ఆరోగ్యం బాగోలేదు. నిత్యం ఒత్తిడికి లోనవుతున్నారు. అసలు మనకీ రాజకీయాలు ఎందుకు నాన్నా..అంటూ రజనీ కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్యలు రజనీకాంత్‌తో చెప్పారు. కొత్త ఏడాదిలో రజనీకాంత్ రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. ఈనెల 31న అందుకు సంబంధించి వివరాలు తెలియజేస్తారని చెప్పారు.
అనూహ్యంగా రజనీకాంత్ అస్వస్థతకు లోను కావడం, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బీపీలో హెచ్చు తగ్గులు రావడంతో ఆయనను హైదరబాద్‌లోని అపోలో చికిత్స అందించారు. ఆతరువాత కుదుటపడ్డాక చెన్నైకు తరలించారు. రజనీ నివాసానికి చేరుకున్న తరువాత, కుటుంబ సభ్యులు రజనీకాంత్ తో ఆరోగ్యంపై సూచనలిస్తూ అసలు మీకు ఆరోగ్యం బాగోలేనప్పడు, మనకీ రాజకీయాలెందుకు నాన్నా..అంటూ సుతిమెత్తగా రజనీ కుమార్తెలు చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉండగా రజనీ కాంత్ రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి కొత్తపార్టీ పనులు యథావిధిగా జరుగుతున్నాయని నిర్వాహకుడు తమిళరువి మణియణ్ స్పష్టం చేశారు. Big breaking ..రజనీకాంత్ రాజకీయాలు విరమించుకున్నట్టు తాజాగా ప్రకటించారు. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు అభిమానులనుద్దేశించి లేఖ విడుదల చేసారు.