హైదరాబాద్(ADITYA9NEWS): సినీనటుడు నందమూరి తారక రామారావు (జూనియర్ ఎన్.టి.ఆర్) కరోనా భారీన పడ్డారు. ఆయనే స్వయంగా ఈ విషయాన్ని అభిమానులకు తెలిపారు. తాను కుటుంబ సభ్యులతో సహా హోమ్ ఐసోలేషన్‌కు వెళ్లినట్టు చెప్పిన ఎన్.టి.ఆర్ అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. తాను పూర్తిగా ఆరోగ్యంగానే ఉన్నానని కొద్ది రోజుల పాటు హోమ్ ఐసోలేషన్‌లో ఉండక తప్పదన్నారు. తనను కలిసిన వారు కూడా కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకుని, తదుపరి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
