ఎంపీ ర‌ఘురామ‌కు ఉహించ‌ని షాక్

హైద‌రాబాద్‌లో అరెస్టు చేసిన ఏపీ సిఐడీ

హైద‌రాబాద్‌,(ADITY9NEWS): న‌ర‌సాపురం పార్ల‌మెంట్ స‌భ్యుడు రఘురామ కృష్ణం రాజుకు ఉహించ‌ని షాక్ త‌గిలింది. ఏపీ సీఐడీ పోలీసులు ఆయ‌న్ను అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని రఘురామ ఇంటికి వెళ్లిన ఏపీ సీఐడీ అధికారులు ఎంపీని అదుపులోకి తీసుకున్నారు. ఈస‌మ‌యంలో ఆయ‌న‌కు భ‌ద్ర‌త‌గా ఉన్న‌సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్టును అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ ఫ‌లించ‌లేదు. త‌మ ఉన్న‌తాధికారుల నుండి ఆదేశాల వ‌చ్చే వ‌ర‌కూ ర‌ఘురామ‌ను తీసుకెళ్ల‌డానికి వీల్లేద‌న్న‌ప్ప‌టికీ సిఐడీ అధికారులు లెక్క చేయ‌లేదు. ఎంపీపై ప‌లు సెక్ష‌న్ల కింద‌ కేసులున్నాయ‌ని, నోటీసులు అందించి తీసుకెళ్లిన‌ట్లు తెలుస్తోంది. IPC.124/A సెక్షన్ తో పాటు ప‌లు సెక్ష‌న్ల కింద‌ నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.

వైసీపీకి చెందిన ఎంపీ అయిన‌ప్ప‌టికీ ఆయ‌న సొంత ప్రభుత్వం పైనే విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ప్ర‌భుత్వ‌ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయన్ను అరెస్ట్ చేసిన‌ట్లు స‌మాచారం. గత కొంతకాలంగా సీఎం జగన్, సజ్జల, వైవీ సుబ్బారెడ్డి తదితరులపై ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. మీడియా ద్వారా ప్రభుత్వ తప్పులను ఎండగడుతూ వస్తున్నారు. ఈ  నేపథ్యంలోనే  ఆయన ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు రావడం, అరెస్ట్ చేయడం రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :