సామర్లకోట,(ADITYA9NEWS) : తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, పంచారామాల్లో ఒకటైన సామర్లకోటలోని శ్రీ కుమారారామ భీమేశ్వరస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈమేరకు దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి డా.జి.వాణిమోహన్ గురువారం(జూన్-3)ఉత్తర్వులు విడుదల చేశారు. నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుండి 20 రోజుల్లో దరఖాస్తులు చేసుకోవాలి. హిందువులైన వారు మాత్రమే మెంబర్లుగా ఉండాలి. బోర్డు మెంబర్లలలో 50 శాతం మహిళలు, 50 శాతం ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్ కలిగిన వారికి అవకాశం ఉంటుంది. పూర్తి దరఖాస్తు వివరాలను నోటిఫికేషన్‌లో పొందుపరిచారు
