ఏపీలో డీఎస్సీకి ముందు బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ,( ADITYA9NEWS) : కేవలం 7 సంవత్సరాలకే పరిమితమైన టెట్ సర్టిఫికెట్‌ల వ్యాలిడిటీని ,విద్యార్థి జీవిత కాలానికి పెంచుతున్నట్లు కేంద్రం తెలిపింది. 2011 నుండి టెట్ రాసిన వారికీ ఇది వర్తిస్తుందని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పొఖ్రి యాల్ ‘నిషాంక్’ తెలిపారు.ఇప్పటికే ఏడేళ్ళ కాలం పూర్తయిన అభ్యర్థులకు కొత్తగా టీఈటీ సర్టిఫికేట్లను జారీ చేయడానికి లేదా, పాతవాటిని రీవ్యాలిడేట్ చేయడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం కోరింది.
ఇప్పటి వరకూ టీచర్ రిక్రూట్‌మెంట్‌కు ముందు టెట్ నిర్వహిస్తున్నారు. రాబోవు రోజుల్లో ఏపీలో భారీ డీఎస్సీ ఉంటుందని అంతా ఆశగా చూస్తున్నారు. డీఎస్సీ పరీక్షకు ముందు టెట్ తప్పనిసరి అని రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది. దీంతో టెట్ రాసేందుకు కొత్త అభ్యర్థులతోపాటు, గతంలో టెట్ రాసి, సర్టిఫికెట్ కాలపరిమితి ముగిసిన వారు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో టెట్ సర్టిఫికెట్ జీవితకాలం పెంపు పాత అభ్యర్థులకు ఊరటనిచ్చింది.