అమరావతి, (ADITYA9NEWS): ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల పెంపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఏపీపీఎస్సీ సభ్యుడు షేక్ సలాంబాబు తెలిపారు. మొత్తం వివిధ కేటగిరిలలో 1,180 ఖాళీలను గుర్తించామన్నారు. వీటిలో గ్రూప్ -1, గ్రూప్ -2 సహా పలు విభాగాల పోస్టులు ఉన్నాయని చెప్పారు. పోస్టులు పెంచి వచ్చే నెల గ్రూప్, పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. గ్రూప్-1 మినహా ఏ నోటిఫికేషన్‌కూ ప్రిలిమ్స్ ఉండదని ఆయన తెలిపారు. ఇక నుంచి వచ్చే ప్రతీ నోటిఫికేషన్ లోనూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇక నుంచి 3,4 నెలల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని సలాంబాబు వెల్లడించారు.
