గౌహతి, (ADITYA9NEWS): అస్సాం ముఖ్యమంత్రి హిమంతవిశ్వ శర్మ మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. తమ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రగ్స్ వాడకాన్ని అనుమతించేది లేదని ప్రతిన పూనారు. డ్రగ్స్ వాడకాన్ని ఉపేక్షించబోమని ఆయన తేల్చి చెప్పారు.
గౌహతి పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ దాదాపు 163 కోట్ల విలువ చేసే డ్రగ్స్‌పై బుల్డోజర్ ఎక్కించి, తొక్కించిన సీఎం, స్వయంగా ఆ డ్రగ్స్‌ను తగలబెట్టారు. డ్రగ్స్ యువతను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని, దీని ద్వారా కుటుంబాలు సర్వనాశనంఅవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చేసిన మంచి పనిపై అస్సాంలో ట్విట్ల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ డ్రగ్స్ ప్రభావం వల్ల చెడిపోతున్న యువతపై సీఎం తీసుకుంటున్న శ్రద్ధకు రాష్ట్రవ్యాప్తంగా అభినందనలు తెలుపుతున్నారు.