రూ.300/- దర్శనం కోటా విడుదల చేసిన టిటిడి
తిరుమల,(ADITYA9NEWS): తిరుమల దర్శనానికి వెళ్లే భక్తుల కోసం టిటిడి తాజాగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను విడుదల చేసింది. ఆగష్టు నెలకు సంబంధించి రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచడం జరిగిందని టిటిడి అధికారులు తెలిపారు. జులై 20న మంగళవారం ఉదయం 9 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో ఉంచింది. రోజుకు 5 వేల చొప్పున టికెట్లను విడుదల చేస్తారు. భక్తులు ఈసౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి స్పష్టం చేసింది.